News March 17, 2024

శింగనమల: మాజీ ఎంపీపీ ఉమాపతి నాయుడు టీడీపీకి రాజీనామా

image

తెలుగుదేశం పార్టీకి తాను రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎంపీపీ నల్లపాటి ఉమాపతి నాయుడు తెలిపారు. ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ.. శింగనమల నియోజకవర్గం టీడీపీలో మితిమీరిన గ్రూపు తగాదాల కారణంగా పార్టీలో పనిచేయ లేని పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. పార్టీ అధినేత చంద్రబాబు అందరినీ కలుపుకొని తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని చెబుతున్నా.. ఇక్కడ నాయకులు విస్మరిస్తున్నారన్నారు.

Similar News

News December 25, 2025

తాడిపత్రి: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

image

తాడిపత్రి మండలంలో రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని చల్లవారిపల్లె సమీపంలో రైల్వే పట్టాలపై మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు.

News December 25, 2025

అనంత జిల్లా పార్లమెంట్ అధికార ప్రతినిధి ఈయనే.!

image

సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు బొమ్మనహల్ దర్గా హోన్నూరు గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు హెచ్.ఆనంద్‌ను జిల్లా పార్లమెంట్ అధికార ప్రతినిధిగా నియమించారు. తాను పార్టీకి, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి పనిచేస్తానని తెలిపారు. ఈ పదవిని ఇచ్చిన ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుకు కృతజ్ఞతలు తెలిపారు.

News December 24, 2025

అగ్రిటెక్ స్టార్టప్‌లను ప్రోత్సహించాలి: కలెక్టర్ ఆనంద్

image

వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని, రైతుల సమస్యల పరిష్కారానికి అగ్రిటెక్ స్టార్టప్‌లను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. బుధవారం వ్యవసాయ, ఉద్యాన, అనుబంధ రంగాల అధికారులతో పాటు రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఆధునిక పద్ధతుల ద్వారా సాగు ఖర్చులు తగ్గించి, రైతులకు లాభసాటిగా మార్చేందుకు కృషి చేయాలని సూచించారు.