News March 17, 2024

శింగనమల: మాజీ ఎంపీపీ ఉమాపతి నాయుడు టీడీపీకి రాజీనామా

image

తెలుగుదేశం పార్టీకి తాను రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎంపీపీ నల్లపాటి ఉమాపతి నాయుడు తెలిపారు. ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ.. శింగనమల నియోజకవర్గం టీడీపీలో మితిమీరిన గ్రూపు తగాదాల కారణంగా పార్టీలో పనిచేయ లేని పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. పార్టీ అధినేత చంద్రబాబు అందరినీ కలుపుకొని తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని చెబుతున్నా.. ఇక్కడ నాయకులు విస్మరిస్తున్నారన్నారు.

Similar News

News October 8, 2024

అనంత జిల్లాలో రోడ్డు ప్రమాదం.. UPDATE

image

అనంతపురం జిల్లా పామిడి పట్టణ శివారులోని శ్రీనివాస మిల్క్ డైరీ సమీపంలో గల 44 నంబర్ జాతీయ రహదారిపై సోమవారం బైక్‌ను ఐచర్ వాహనం ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పామిడిలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన లాలెప్ప తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందారు. మృతుడు గుత్తి ఏపీ మోడల్ స్కూలులో అటెండర్‌గా పని చేస్తున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

News October 8, 2024

మంత్రి భరత్‌ను కలిసిన ఎంపీ అంబిక

image

రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ను అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మినారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. కర్నూలులోని మంత్రి నివాసంలో కలిసి జిల్లాలో సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. అనంతపురం నగరాన్ని పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దాలని కోరారు. పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.

News October 7, 2024

అనంతపురం జిల్లాలో 421 దరఖాస్తులు!

image

అనంతపురం జిల్లాలో మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ఇప్పటివరకు అనంతపురం జిల్లాలో 136 మద్యం దుకాణాలకు గానూ 289, సత్యసాయి జిల్లాలో 87 దుకాణాలకు గానూ 132 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణకు ఇక మూడు రోజులే గడువుంది. అయితే జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో ముఖ్యనేతలు మద్యం దుకాణాలకు ఎవరూ దరఖాస్తులు వేయొద్దని, వాటిని తమకు వదిలేయాలని వ్యాపారులను హెచ్చరిస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి.