News April 25, 2024

శిరోముండనం కేసు విచారణ వాయిదా

image

దళిత యువకులకు శిరోముండనం చేసిన కేసులో బాధితులను ప్రతివాదులుగా చేర్చాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో విశాఖ SC, ST కోర్టు YCP MLC తోట త్రిమూర్తులు, మరో 8మందికి 18 నెలల జైలు శిక్ష విధించారు. దీనిపై వారు హైకోర్టును ఆశ్రయించారు. కాగా బాధితులు తమ వాదన చెప్పుకునే అవకాశం ఇవ్వాలని వారి తరఫు న్యాయవాదులు కోరారు. దీంతో వారిని ప్రతివాదులుగా చేర్చాలని ఆదేశించిన న్యాయమూర్తి మే 1కి విచారణను వాయిదా వేశారు.

Similar News

News January 17, 2025

ACCIDENT: 9 మంది దుర్మరణం

image

మహారాష్ట్రలోని నాసిక్-పుణే హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఐచర్ ప్యాసింజర్లతో వెళ్తోన్న మాక్సిమోను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో మాక్సిమో ముందున్న బస్సును ఢీకొంది. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం ధాటికి మాక్సిమో నుజ్జునుజ్జయింది. పుణే సమీపంలోని నారాయణ్‌గావ్ రోడ్డుపై ఈ యాక్సిడెంట్ అయింది.

News January 17, 2025

ఆర్థిక వ్యవస్థలో అమెరికాను దాటనున్న ఇండియా!

image

రానున్న 50 ఏళ్లలో ఇండియా జీడీపీ భారీగా పెరుగుతుందని ‘గోల్డ్‌మన్ సాక్స్’ అంచనా వేసింది. 2075 నాటికి ఇండియా $52.5 ట్రిలియన్‌తో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని పేర్కొంది. $57 ట్రిలియన్‌తో చైనా జీడీపీలో నంబర్ 1గా మారనుందని తెలిపింది. కాగా, మూడో స్థానంలో USA ($51.5 ట్రిలియన్‌), నాలుగో ప్లేస్‌లో ఇండోనేషియా ($13.7ట్రి), ఐదో స్థానంలో నైజీరియా ($13.1ట్రి) ఉంటాయని వెల్లడించింది.

News January 17, 2025

BJP మ్యానిఫెస్టో: అబ్బాయిలకూ ఫ్రీ బస్సు?

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ అస్త్రాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉచిత బస్సు సౌకర్యాన్ని చదువుకునే అబ్బాయిలకు, వృద్ధులకూ కల్పించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ స్కీం కింద మహిళలు మాత్రమే లబ్ధి పొందుతున్నారు. అలాగే గృహావసరాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆలయాలకు 500 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ నడ్డా మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు.