News December 5, 2024

పెళ్లి తర్వాత శోభిత తొలి పోస్ట్

image

అక్కినేని హీరో నాగచైతన్యతో వివాహం తర్వాత హీరోయిన్ శోభిత తొలి పోస్ట్ చేశారు. చైతూతో ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ‘పెళ్లి ఫొటో’ అని క్యాప్షన్ ఇచ్చారు. కాగా నిన్న వీరిద్దరి వివాహం అన్నపూర్ణ స్టూడియోలో కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.

Similar News

News January 21, 2025

జాక్ పాట్.. రూ.10 కోట్ల లాటరీ గెలిచిన లారీ డ్రైవర్

image

పంజాబ్‌కు చెందిన లారీ డ్రైవర్ జాక్ పాట్ కొట్టాడు. పంజాబ్ స్టేట్ డియర్ లోహ్రీ మకర్ సంక్రాంతి బంపర్-2025లో రూప్ నగర్ జిల్లాకు చెందిన హర్పిందర్ సింగ్ రూ.10 కోట్లు గెలుచుకున్నాడు. ఇప్పటివరకు అందించిన అతిపెద్ద లాటరీ ప్రైజ్ మనీ ఇదేకావడం విశేషం. సింగ్ కువైట్‌లో ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సెలవులపై తిరిగొచ్చి రూ.500 పెట్టి లాటరీ టికెట్ కొని కోటీశ్వరుడయ్యాడు. గత 15 ఏళ్లుగా అతను లాటరీలు కొంటున్నాడు.

News January 21, 2025

12 గంటలుగా కొనసాగుతున్న ఐటీ సోదాలు

image

టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల ఇళ్లు, కార్యాలయాల్లో 12 గంటలుగా సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని ఎస్వీసీ, మైత్రీ, వృద్ధి సినిమాస్‌లో అధికారులు తనిఖీ చేస్తున్నారు. మొత్తం 8 చోట్ల 55 బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. ప్రధానంగా దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఆయన తమ్ముడు శిరీష్, కుమార్తె నివాసాల్లోనూ కొనసాగుతున్నాయి. భార్య తేజస్వినితో బ్యాంకు లాకర్లు ఓపెన్ చేయించారు.

News January 21, 2025

IOC ప్రెసిడెంట్‌తో ICC ఛైర్మన్ జై షా

image

ఐఓసీ (ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ) ప్రెసిడెంట్ థామస్ బాచ్‌తో ఐసీసీ ఛైర్మన్ జై షా న్యూజిలాండ్‌లో మరోసారి సమావేశమయ్యారు. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చే అంశంపై వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. లాస్ ఏంజెలిస్ 2028 ఒలింపిక్స్‌లోనే క్రికెట్‌ను చేర్చాలని జై షా పట్టుబట్టినట్లు సమాచారం. కాగా ఇటీవల ఆస్ట్రేలియాలోనూ 2032 బ్రిస్బేన్ ఒలింపిక్ ఆర్గనైజింగ్ కమిటీ చీఫ్‌‌తో జై షా భేటీ అయ్యారు.