News June 4, 2024
అజిత్ ఎన్సీపీకి షాక్.. 8 చోట్ల శరద్ ఎన్సీపీ లీడింగ్
మహారాష్ట్రలో NCP (SP) 10 స్థానాల్లో బరిలో నిలవగా 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు అజిత్ పవార్ సారథ్యంలోని NCP 5 స్థానాల్లో పోటీ చేయగా కేవలం ఒక్క స్థానంలో(రాయిగఢ్) ముందంజలో ఉంది. ఆ రాష్ట్రంలో ఇండియా కూటమి 28 స్థానాల్లో, ఎన్డీఏ 17 చోట్ల లీడింగ్‌లో కొనసాగుతున్నాయి.
Similar News
News November 12, 2024
చినాబ్ రైల్వే బ్రిడ్జిపై మాక్ డ్రిల్
J&Kలోని చినాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిపై ఇవాళ భద్రతా దళాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఏదైనా విపత్తు సంభవిస్తే ఎలా అప్రమత్తం కావాలనేది చేసి చూపించాయి. SOG, CRPF 126bn, GRP, RPF, SDRF, ఫైర్&ఎమర్జెన్సీ, మెడికల్ బృందాలు డ్రిల్‌లో పాల్గొన్నాయి. నదీ గర్భం నుంచి 359M ఎత్తులో 1,315M పొడవుతో దీన్ని నిర్మించారు. దీనిపై 4 నెలల కిందట రైలు సర్వీసులు ప్రారంభమయ్యాయి.
News November 12, 2024
వర్మతో వర్మ అండ్ వర్మ.. ఫొటో వైరల్
డైరెక్టర్ రాంగోపాల్ వర్మను యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, ‘ఫ్యామిలీ మ్యాన్’ రైటర్ సుపర్న్ వర్మ కలిశారు. ఈ సందర్భంగా వారు తీసుకున్న ఫొటోను రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. వర్మతో వర్మ అండ్ వర్మ అని ఆ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు. అయితే, తమకు క్యాస్ట్ ఫీలింగ్ లేదనే విషయంపై తాను ప్రమాణం చేయలేనని చమత్కరించారు. ఈ ముగ్గురూ నిన్న రాత్రి ఓ పార్టీలో కలిసినట్లు తెలుస్తోంది.
News November 12, 2024
GOOD NEWS: ఫ్రీ కోచింగ్, నెలకు రూ.2,500
AP: బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి ఉచిత డీఎస్సీ కోచింగ్ ప్రారంభించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 5,200 మందికి కోచింగ్ ఇస్తామని, BCలకు 66%, SCలకు 20%, STలకు 14% చొప్పున సీట్లు కేటాయించామన్నారు. వారితో పాటు EWS అభ్యర్థులకు 520 సీట్లు అదనంగా కేటాయించామని చెప్పారు. 2 నెలల పాటు ఇవ్వనున్న ఈ కోచింగ్ టైంలో నెలకు రూ.1500 స్టైఫండ్, మెటీరియల్ కోసం రూ.1000 ఇస్తామని తెలిపారు.