News March 19, 2024
మహారాష్ట్రలో బీఆర్ఎస్కు షాక్

మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. రైతు సంఘం నేత మాణిక్ రావు కదం ఆ పార్టీని వీడి అజిత్ పవార్ వర్గం ఎన్సీపీలో చేరారు. మరోవైపు NCP ఆయనకు కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించింది.
Similar News
News August 28, 2025
నేను ఎందుకు రిటైర్ అవ్వాలి: షమీ

భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘నేను ఎందుకు రిటైర్ అవ్వాలి? మీకు ఏమైనా సమస్య ఉంటే చెప్పండి. నా రిటైర్మెంట్తో ఎవరికి మేలు కలుగుతుంది? బోర్ కొట్టినరోజే వెళ్లిపోతా. జాతీయ జట్టుకు తీసుకోకపోతే డొమెస్టిక్ క్రికెట్ ఉంది. ఎక్కడో ఒకచోట ఆడుతూనే ఉంటా. నన్ను సెలక్ట్ చేయనందుకు ఎవర్నీ నిందించను. అవకాశం వచ్చినప్పుడు సత్తా చాటుతా. అందుకోసమే కష్టపడుతున్నా’ అని స్పష్టం చేశారు.
News August 28, 2025
సరిహద్దుల్లో కాల్పులు.. ఇద్దరు టెర్రరిస్టులు హతం

జమ్మూ కశ్మీర్‌లోని గురెజ్ సెక్టార్లో LoC గుండా చొరబాటుకు యత్నించిన ఇద్దరు టెర్రరిస్టులను ఆర్మీ మట్టుబెట్టింది. కొంతమంది ఉగ్రవాదులు భారత భూభాగంలోకి ప్రవేశిస్తున్నారని తెలుసుకున్న సైన్యం వెంటనే అప్రమత్తమైంది. J&K పోలీసులతో కలిసి ‘నౌషేరా నార్-4’ పేరిట జాయింట్ ఆపరేషన్ చేపట్టి ఇద్దరిని ఎన్కౌంటర్ చేసింది. మిగిలిన వారి కోసం పరిసర ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు ఆర్మీ ట్వీట్ చేసింది.
News August 28, 2025
భారత్‌తో వైరం.. ట్రంప్‌పై హౌస్ డెమోక్రాట్స్ ఫైర్

భారత్‌పై ట్రంప్ టారిఫ్స్ విధించడాన్ని అమెరికన్లు సైతం తప్పుపడుతున్నారు. తాజాగా హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ డెమోక్రాట్స్ ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు. ‘రష్యా నుంచి భారీగా ఆయిల్ కొంటున్న చైనా తదితర దేశాలపై టారిఫ్స్ వేయకుండా ఇండియానే టార్గెట్ చేస్తున్నారు. US-భారత్ సంబంధాలను దెబ్బతీస్తున్నారు. అమెరికన్స్‌కు నష్టం జరుగుతోంది. ఇది ఉక్రెయిన్ కోసం చేస్తున్నట్లు అనిపించట్లేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.