News March 19, 2024
మహారాష్ట్రలో బీఆర్ఎస్‌కు షాక్
మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. రైతు సంఘం నేత మాణిక్ రావు కదం ఆ పార్టీని వీడి అజిత్ పవార్ వర్గం ఎన్సీపీలో చేరారు. మరోవైపు NCP ఆయనకు కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించింది.
Similar News
News September 14, 2024
సూర్యా.. భారత్‌కు మరెన్నో విజయాలు అందించు: జై షా
టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ బర్త్ డే సందర్భంగా బీసీసీఐ కార్యదర్శి జై షా ఆయనకు ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ‘భారత టీ20ఐ కెప్టెన్, మిస్టర్ 360 సూర్య కుమార్ యాదవ్‌కు హ్యాపీ బర్త్ డే. పొట్టి ఫార్మాట్‌లో మన జట్టుకు మీరు మరెన్నో విజయాలకు సాధించిపెట్టాలి. బెస్ట్ విషెస్ ఫర్ ది ఇయర్ ఎహెడ్’ అని ట్వీట్ చేశారు. ఈరోజు సూర్య తన 34వ పుట్టినరోజును జరుపుకొంటున్నారు.
News September 14, 2024
ట్రంప్, కమల ఇద్దరూ చెడ్డవాళ్లే: పోప్
అమెరికా అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్‌పై పోప్ ఫ్రాన్సిస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరూ జీవనానికి వ్యతిరేకులేనని పేర్కొన్నారు. ‘ట్రంప్ వలసలకు వ్యతిరేకి. కమల అబార్షన్‌కు మద్దతునిస్తున్నారు. నేను అమెరికన్ కాదు. నాకు అక్కడ ఓటు లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం. వారిద్దరూ చేసేది పాపమే. అమెరికన్లు ఆ ఇద్దరిలో తక్కువ చెడ్డ వ్యక్తిని ఎంచుకోవాల్సి ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు.
News September 14, 2024
త్వరలో దుబాయ్, సింగపూర్‌లకు విమానాలు: రామ్మోహన్
APలో విమాన ప్రయాణికుల సంఖ్య మరింత పెంచుతామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో విజయవాడ-ఢిల్లీ ఇండిగో సర్వీసును ఆయన ప్రారంభించారు. ‘3 నెలల్లో 4 కొత్త సర్వీసులు ప్రారంభించాం. OCT 26న విజయవాడ-పూణె, అక్టోబర్ 27న విశాఖ-ఢిల్లీ సర్వీసులు ప్రారంభిస్తాం. త్వరలోనే దుబాయ్, సింగపూర్‌కు సర్వీసులు ప్రారంభిస్తాం. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా కనెక్టివిటీ పెంచుతాం’ అని ప్రకటించారు.