News January 5, 2025
భారత్‌కు షాక్

ఆస్ట్రేలియా ముందు 162 రన్స్ టార్గెట్ ఉంచిన భారత్.. ఆశలన్నీ స్టార్ బౌలర్ బుమ్రాపైనే పెట్టుకుంది. కానీ నిన్న గాయపడ్డ అతడు ఇవాళ బ్యాటింగ్‌కు వచ్చినా బౌలింగ్‌కు రాలేదు. అతడి ప్లేస్‌లో అభిమన్యు ఈశ్వరన్ ఫీల్డింగ్‌కు వచ్చారు. ఇక సిరాజ్, ప్రసిద్ధ్ బౌలింగ్‌లో AUS ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. 3 ఓవర్లలోనే 35 రన్స్ చేశారు. దీంతో భారత్ పరాజయం లాంఛనమే కానుందా?
Similar News
News December 1, 2025
కోహ్లీ 100 సెంచరీలు చేస్తారా?

SAపై నిన్న కోహ్లీ చెలరేగిన తీరు చూస్తే సచిన్ 100 సెంచరీల రికార్డును చేరుకోవడం కష్టం కాదేమో అని క్రీడా వర్గాల్లో టాక్ మొదలైంది. 2027 WCకు ముందు భారత్ ఇంకా 20 వన్డేలు ఆడనుంది. లీగ్‌లో ఫైనల్‌కు చేరితే మరో 5 నుంచి 10 మ్యాచులు ఆడే ఆస్కారం ఉంది. ప్రస్తుతం 83 శతకాలు బాదిన కోహ్లీ ఇక నుంచి ప్రతి 3 మ్యాచులకు 2 సెంచరీలు చేస్తే సచిన్ సరసన నిలిచే ఛాన్సుంది. మరి విరాట్ ఆ ఘనత సాధిస్తారా? మీ COMMENT.
News December 1, 2025
భారీ జీతంతో NTPCలో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

<
News December 1, 2025
లైంగిక వేధింపులు.. హీరోయిన్ కజిన్ ఆత్మహత్య

లైంగిక వేధింపులను భరించలేక హీరోయిన్ ఆశికా రంగనాథ్ కజిన్ అచల(22) ఆత్మహత్య చేసుకున్నారు. ‘దూరపు బంధువు మయాంక్‌తో అచలకు స్నేహం ఏర్పడింది. డ్రగ్స్‌కు బానిసైన మయాంక్ ఆమెను ప్రేమిస్తున్నానని ఫిజికల్ రిలేషన్ కోసం ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించడంతో దాడి చేసి, మానసికంగా వేధించాడు’ అని బంధువులు ఆరోపిస్తున్నారు. అచల Nov 22న బెంగళూరులో ఉరేసుకుందని, ఇప్పటికీ మయాంక్‌పై చర్యలు తీసుకోలేదని మండిపడుతున్నారు.


