News January 30, 2025
జియో యూజర్లకు షాక్

జియో తమ యూజర్లకు షాకిచ్చింది. ఎలాంటి సమాచారం లేకుండా రూ.189, రూ.479 ప్రీపెయిడ్ ప్లాన్లను తొలగించింది. మొబైల్ డేటా తక్కువగా వాడేవారు ఈ రీఛార్జ్ ప్లాన్లను ఎక్కువగా ఉపయోగిస్తారు. రూ.189కి 28 రోజుల వ్యాలిడిటీతో 2జీబీ డేటా+అపరిమిత కాల్స్, రూ.479కి 84 రోజుల వ్యాలిడిటీతో 6GB డేటా+అపరిమిత కాల్స్ ఉండేవి. సమాచారం లేకుండా ప్లాన్లు తొలగించడంపై పలువురు వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News October 14, 2025
రంజీ ట్రోఫీకి ఏపీ జట్టు ఇదే

రంజీ ట్రోఫీ (2025-26)లో ఆడే జట్టును ఏపీ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. రికీ భుయ్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు.
జట్టు: రికీ భుయ్ (C), KS భరత్, అభిషేక్ రెడ్డి, SK రషీద్, కరణ్ షిండే, PVSN రాజు, KV శశికాంత్, సౌరభ్ కుమార్, Y పృథ్వీరాజ్, T విజయ్, S ఆశిష్, అశ్విన్ హెబ్బర్, రేవంత్ రెడ్డి, K సాయితేజ, CH స్టీఫెన్, Y సందీప్.
News October 14, 2025
1,968 మంది టెర్రరిస్టులను తరలించాం: ఇజ్రాయెల్

గాజా పీస్ ప్లాన్లో భాగంగా తమ అధీనంలో ఉన్న 20 మంది ఇజ్రాయెల్ బందీలను హమాస్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇజ్రాయెల్ కూడా తమ జైళ్లలో ఉన్న పాలస్తీనియన్ల విడుదల ప్రక్రియను స్టార్ట్ చేసింది. ‘దేశవ్యాప్తంగా వివిధ జైళ్లలో ఉన్న 1,968 మంది టెర్రరిస్టులను ఓఫర్, కట్జియోట్ కేంద్రాలకు తరలించాం. అనుమతుల ప్రక్రియ ముగిశాక వారిని గాజాకు పంపిస్తాం’ అని అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
News October 14, 2025
SC వర్గీకరణ.. మీ సేవల్లో కొత్త సర్టిఫికెట్లు తీసుకోవచ్చు: మంత్రి

TG: అన్ని మీసేవ కేంద్రాలను కొత్తగా ఉపవర్గీకరించిన షెడ్యూల్ కుల గ్రూపులతో అప్డేట్ చేసినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణ చట్టం నవంబర్ 15-2025, జీ.ఓ.ఎంఎస్. నంబర్ 9(షెడ్యూల్ కులాల శాఖ, 14-04-2025) ప్రకారం ఈ వర్గీకరణ వ్యవస్థను అమలు చేశామన్నారు. ఇకపై ప్రజలు తమ వర్గానికి సరిపడే ధ్రువపత్రాలను సులభంగా పొందవచ్చని, SC, ST, BC క్యాస్ట్ సర్టిఫికెట్ల రీఇష్యూ సదుపాయాన్ని కూడా ప్రారంభించామన్నారు.