News January 30, 2025

జియో యూజర్లకు షాక్

image

జియో తమ యూజర్లకు షాకిచ్చింది. ఎలాంటి సమాచారం లేకుండా రూ.189, రూ.479 ప్రీపెయిడ్ ప్లాన్లను తొలగించింది. మొబైల్ డేటా తక్కువగా వాడేవారు ఈ రీఛార్జ్ ప్లాన్లను ఎక్కువగా ఉపయోగిస్తారు. రూ.189కి 28 రోజుల వ్యాలిడిటీతో 2జీబీ డేటా+అపరిమిత కాల్స్, రూ.479కి 84 రోజుల వ్యాలిడిటీతో 6GB డేటా+అపరిమిత కాల్స్ ఉండేవి. సమాచారం లేకుండా ప్లాన్లు తొలగించడంపై పలువురు వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News February 16, 2025

హార్ట్ బ్రేకింగ్ PHOTO.. చిట్టితల్లికి ఎంత కష్టమో!

image

రూ.లక్షల కోట్ల బడ్జెట్. కోట్లాది మంది ఉద్యోగులు, పోలీసులు. లేటెస్ట్ టెక్నాలజీ. అయినా మన దేశంలో సాధారణ ప్రజల ప్రాణాలకు గ్యారంటీ లేదు. నిన్న ఢిల్లీ రైల్వేస్టేషన్లో జరిగిన తొక్కిసలాట తర్వాత సగటు భారతీయుడి ఆవేదన ఇది. కాలు పెట్టేందుకు కూడా చోటు లేని రైల్లో తన కూతురిని జాగ్రత్తగా ఎత్తుకున్న తండ్రి ఫొటో చూస్తే గుండెలు బరువెక్కుతున్నాయి. ఆ రద్దీ, తోపులాటకు తాళలేక ఆ పసిపాప గుక్కపెట్టి ఏడుస్తోంది.

News February 16, 2025

రేవంత్ ఢిల్లీకి వెళ్లేది అందుకే : కిషన్ రెడ్డి

image

TG: దేశంలో ఏ సీఎం కూడా వారానికోసారి ఢిల్లీ వెళ్లినట్టు చరిత్రలో లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో అటెండెన్స్ వేసుకుంటున్నారని ఆరోపించారు. రాహుల్ డైరక్షన్ లోనే రేవంత్ ప్రధానిపై విమర్శలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల భర్తీ తప్ప.. కాంగ్రెస్ ఇచ్చిన కొత్త ఉద్యోగాలేమి లేవని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు.

News February 16, 2025

చావును గెలిచిన పసికందు.. గొంతుకోసినా..!

image

ఆడపిల్లన్న కోపంతో నవజాత శిశువుపై జాలి కూడా లేకుండా సొంత అమ్మమ్మే ఆ పసిదాని గొంతుకోసి చెత్తకుండీలో విసిరేసింది. దారిన పోయేవాళ్లు చూసి ఆస్పత్రిలో చేర్పించారు. నెలరోజుల పాటు మరణంతో పోరాడిన ఆ బుజ్జాయి, వైద్యుల సహాయంతో ఎట్టకేలకు చావును జయించింది. MPలోని భోపాల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బిడ్డపై కర్కశంగా వ్యవహరించిన ఆమె తల్లి, అమ్మమ్మను పోలీసులు అరెస్ట్ చేశారు.

error: Content is protected !!