News June 13, 2024
న్యూజిలాండ్‌కు షాక్.. సూపర్-8కు చేరిన విండీస్

టీ20WC: NZపై వెస్టిండీస్ విజయం సాధించింది. ఆ జట్టు 13 పరుగుల తేడాతో కివీస్‌ను ఓడించింది. 150 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 136/9కే పరిమితమైంది. గ్లెన్ ఫిలిప్స్ (40), అలెన్ (26) రాణించారు. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ 4, మోతీ 3 వికెట్లతో చెలరేగారు. అంతకుముందు రూథర్‌ఫర్డ్ (68) వీరవిహారంతో విండీస్ 149/9 పరుగులు చేసింది. ఈ విజయంతో WI సూపర్-8కి చేరగా, NZకు బెర్త్ కష్టంగా మారింది.
Similar News
News March 26, 2025
24 గంటల్లో 62 మంది మృతి

గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులను ఉద్ధృతం చేసింది. గత 24 గంటల్లో 62 మంది పాలస్తీనీయులు మరణించినట్లు గాజా అధికారులు ప్రకటించారు. వీరిలో పిల్లలు కూడా ఉన్నారని తెలిపారు. దక్షిణ గాజాలోని, ఖాన్ యూనిస్‌లో పునరావాస కేంద్రాలపై జరిగిన దాడుల్లో ఐదుగురు శరణార్థులు చనిపోయారని పేర్కొన్నారు. కాగా కాల్పుల విరమణను ఉల్లంఘించిన ఇజ్రాయెల్‌ను అడ్డుకోవాలని అంతర్జాతీయ సమాజానికి హమాస్ విజ్ఞప్తి చేసింది.
News March 26, 2025
మళ్లీ ప్రేమ గురించి ఆలోచిస్తున్నా: నటాషా

హార్దిక్ పాండ్యతో విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ ప్రేమ గురించి ఆలోచిస్తున్నట్లు నటాషా తెలిపారు. సరైన సమయం వచ్చినప్పుడు నచ్చిన భాగస్వామి దొరకడం ఖాయమని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రేమ మాత్రమే కాదు పరస్పరం గౌరవించుకునే అనుబంధాలను తాను ఇష్టపడతానని పేర్కొన్నారు. మళ్లీ మోడలింగ్, నటనను మొదలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
News March 26, 2025
AB -PMJAY: గిగ్ వర్కర్స్‌కు గుడ్‌న్యూస్

గిగ్ వర్కర్స్, వారి కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ప్రయోజనాలను అందించే ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చిందని లేబర్ మినిస్ట్రీ సెక్రటరీ సుమిత తెలిపారు. ‘గిగ్ వర్కర్స్‌కు ఆరోగ్య బీమా అందించాలి. ఆయుష్మాన్ స్కీమ్ కింద వారికి అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. త్వరలోనే ఇది అమల్లోకి వస్తుంది’ అని వెల్లడించారు. దీంతో ఉబర్, ఓలా, స్విగ్గీ, జొమాటో వర్కర్స్‌కు రూ.5లక్షల ఆరోగ్య బీమా లభించనుంది.