News December 3, 2024
రిలీజ్కు ముందు ‘పుష్ప-2’కు షాక్!

విడుదలకు ముందు పుష్ప-2 మూవీకి షాక్ తగిలినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఈ నెల 5న త్రీడీలో రిలీజ్ అవట్లేదని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇంకా ప్రింట్లు రెడీ కాకపోవడమే దీనికి కారణమని తెలిపాయి. అయితే ఈ నెల 13నుంచి 3D వెర్షన్ అందుబాటులో ఉంటుందని వెల్లడించాయి. దీనిపై మూవీ యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
Similar News
News November 24, 2025
MHBD: ఎస్టీలకే అన్ని సర్పంచ్ స్థానాలు!

మహబూబాబాద్ రెవెన్యూ డివిజన్లోని 11 మండలాలకు సర్పంచ్ రిజర్వేషన్లను ఆర్డీవో కార్యాలయంలో ఆదివారం ఖరారు చేశారు. జిల్లాలోని బయ్యారం (29), కొత్తగూడ (24), గార్ల (20) మండలాల్లోని అన్ని సర్పంచ్ స్థానాలు ఎస్టీ (ST) సామాజిక వర్గానికే రిజర్వ్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయం వల్ల ఈ మూడు మండలాల్లో స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ఇతర సామాజిక వర్గాల నాయకులకు నిరాశ తప్పలేదు.
News November 24, 2025
చెరకు నరికిన తర్వాత ఆలస్యం చేస్తే..

చెరకు నరికిన తర్వాత రోజులు, గంటలు గడుస్తున్నకొద్దీ గడలలోని సుక్రోజ్ శాతం తగ్గుతుంది. ఈ గడలను గానుగాడించకుండా ఉంచితే.. నిల్వ కాలం పెరిగేకొద్దీ బరువు తగ్గుతుంది. చెరకు నరికిన తర్వాత 24 గంటలు ఆలస్యమైతే 1.5%, 48 గంటలు ఆలస్యమైతే 3%, 72 గంటలు ఆలస్యమైతే 5% వరకు దిగుబడిలో నష్టం జరుగుతుంది. అదే విధంగా రసనాణ్యతలోనూ 0.4%-0.6% వరకు క్షీణత కనిపిస్తుంది. నరికిన చెరకును నీడలో ఉంచితే ఈ నష్టం కొంత తగ్గుతుంది.
News November 24, 2025
పిల్లల ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారా?

ఇదివరకు పిల్లల ఫొటోలు, వీడియోలు కుటుంబం వరకే పరిమితమయ్యేవి. కానీ సోషల్మీడియా వచ్చిన తర్వాత పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్నీ పేరెంట్స్ ప్రపంచంతో షేర్ చేసుకుంటున్నారు. అయితే ఇది సరికాదంటున్నారు నిపుణులు. పిల్లల ప్రైవసీని కాపాడటం తల్లిదండ్రుల బాధ్యత. పిల్లల ఫొటోలు, వివరాలు షేర్ చేయడం వల్ల మార్ఫింగ్, ఐడెంటిటీ థెఫ్ట్ వంటి ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సూచిస్తున్నారు.


