News December 3, 2024

రిలీజ్‌కు ముందు ‘పుష్ప-2’కు షాక్!

image

విడుదలకు ముందు పుష్ప-2 మూవీకి షాక్ తగిలినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఈ నెల 5న త్రీడీలో రిలీజ్ అవట్లేదని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇంకా ప్రింట్లు రెడీ కాకపోవడమే దీనికి కారణమని తెలిపాయి. అయితే ఈ నెల 13నుంచి 3D వెర్షన్ అందుబాటులో ఉంటుందని వెల్లడించాయి. దీనిపై మూవీ యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

Similar News

News January 14, 2026

మధిర, వైరా నియోజకవర్గాలకు రూ.140 కోట్లు మంజూరు

image

మధిర మున్సిపాలిటీ పరిధిలో డ్రైయిన్స్, వైరా నది రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.140 కోట్ల ప్రత్యేక అభివృద్ధి నిధులు మంజూరు చేసిందని Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. రూ.40 కోట్లతో మధిర మున్సిపాలిటీలో డ్రైయిన్ నిర్మాణం, రూ.65 కోట్లతో వైరా నది వెంట వరద నివారణ కోసం రిటైనింగ్ వాల్ నిర్మాణం, ప్రస్తుతం ఉన్న మురుగునీటి కాలువల ఆధునీకరణ పనులకు రూ.35 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.

News January 14, 2026

వినాశకర పరిణామాలుంటాయ్.. అమెరికాకు రష్యా పరోక్ష హెచ్చరిక

image

ఇరాన్‌లో అమెరికా జోక్యం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని రష్యా తెలిపింది. ‘2025 జూన్‌లో ఇరాన్‌పై చేసిన దాడిని రిపీట్ చేయాలనుకునేవారు, బయటి శక్తుల ప్రేరేపిత అశాంతిని వాడుకోవాలనుకునేవారు.. అటువంటి చర్యల వల్ల మిడిల్‌ఈస్ట్‌లో పరిస్థితులపై, అంతర్జాతీయ భద్రతపై ఉండే వినాశకరమైన పరిణామాల పట్ల అలర్ట్‌గా ఉండాలి’ అంటూ పరోక్షంగా హెచ్చరించింది. అంతకుముందు ఇరాన్ నిరసనకారులకు సాయం అందబోతోందని ట్రంప్ ప్రకటించారు.

News January 14, 2026

టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

image

సికింద్రాబాద్, RKపురంలోని <>ఆర్మీ పబ్లిక్ స్కూల్<<>> 38 టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు FEB 3వరకు దరఖాస్తు హార్డ్‌ కాపీని అందజేయాలి. పోస్టును బట్టి సంబంధిత డిగ్రీ, BEd/MEd, CTET/TET, BCA, డిగ్రీ(CS)/BE/BTech, B.El.Ed/ D.El.Ed, MCA, డిగ్రీ ఫైన్ ఆర్ట్స్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: apsrkpuram.edu.in/