News July 11, 2024
నెదర్లాండ్స్‌కు షాక్.. ఫైనల్‌కు ఇంగ్లండ్

యూరో ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ సెమీస్‌లో ఇంగ్లండ్ విజయం సాధించింది. నెదర్లాండ్స్‌పై 2-1 గోల్స్ తేడాతో గెలుపొంది ఫైనల్ చేరింది. తొలి అర్ధభాగంలో ఇరు జట్లు చెరో గోల్ చేశాయి. ఆట చివరి నిమిషంలో ENG ప్లేయర్ వాట్కిన్స్ గోల్ చేయడంతో నెదర్లాండ్స్‌కు ఓటమి తప్పలేదు. IST ప్రకారం 14న అర్ధరాత్రి జరిగే ఫైనల్లో స్పెయిన్‌తో ఇంగ్లండ్ తలపడనుంది. జర్మనీలో జరుగుతున్న ఈ టోర్నీలో మూడో స్థానం కోసం పోటీ లేకపోవడం గమనార్హం.
Similar News
News February 19, 2025
మస్కిటో కాయిల్ ఎంత పని చేసింది!

AP: గన్నవరంలోని లిటిల్ లైట్స్ అనాథాశ్రమంలో <<15497063>>అగ్నిప్రమాదం ఘటనలో<<>> కీలక విషయాలు వెలుగు చూశాయి. మస్కిటో కాయిల్ వల్ల ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. బెడ్ పక్కనే కాయిల్ పెట్టుకొని విద్యార్థి పడుకోవడంతో ఫ్యాన్ వేగానికి మంటలు చెలరేగినట్లు సమాచారం. ఈ క్రమంలో పొగ గది మొత్తం వ్యాపించడంతో విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. 70 మంది విద్యార్థులున్న గదికి ఒకటే ద్వారం ఉండటంతో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి.
News February 19, 2025
విజయవాడ వెళ్లే వారికి గుడ్ న్యూస్

హైదరాబాద్-విజయవాడకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ మార్గంలో వెళ్లే లహరి-నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 10 శాతం, రాజధాని ఏసీ బస్సుల్లో 8శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఈ సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొంది. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు.
News February 19, 2025
CHAMPIONS TROPHY: 12 వేల మందితో భారీ భద్రత!

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం పీసీబీ భారీ భద్రత ఏర్పాటు చేసింది. ఇందులో 18 మంది సీనియర్ ఆఫీసర్లు, 54 మంది డీఎస్పీలు, 135 మంది ఇన్‌స్పెక్టర్లు, 1,200 మంది అప్పర్ సబార్డినేట్‌లు, 10,556 మంది కానిస్టేబుళ్లను నియమించింది. అదనంగా 200 మంది మహిళా అధికారులు కూడా ఉన్నారు. అలాగే ఆటగాళ్లు, ప్రముఖుల కోసం 9 స్పెషల్ చార్టర్ ఫ్లైట్లను కూడా అందుబాటులో ఉంచింది. లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్ మధ్య ఇవి ప్రయాణిస్తాయి.