News August 26, 2024
వైసీపీకి షాక్.. మేయర్ రాజీనామా

AP: ఏలూరు కార్పొరేషన్‌లో వైసీపీకి షాక్ తగిలింది. మేయర్ షేక్ నూర్జహాన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రేపు తన భర్త ఎస్ఎంఆర్ పెదబాబుతో కలిసి ఆమె టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. వారితో పాటు 30 మంది కార్పొరేటర్లు ఉండవల్లిలో నారా లోకేశ్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News April 20, 2026
డిగ్రీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫ్రీ హాస్టల్, కోచింగ్

TG: మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ BC గురుకుల డిగ్రీ కాలేజీల్లో 2026-27 అకడమిక్ ఇయర్ అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 30 కాలేజీల్లో BSc, BCom, BBA లాంటి రెగ్యులర్ కోర్సులతో పాటు యానిమేషన్ వంటి స్పెషల్ కోర్సుల్లో 9,260 సీట్లు ఉన్నాయి. విద్యార్థులు మే 10వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఉచిత వసతితోపాటు క్వాలిటీ ఎడ్యుకేషన్, పోటీ పరీక్షలకు కోచింగ్ ఇస్తారు.
News April 20, 2026
జనగణన ఉన్నా.. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ?

TG: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల నిషేధాన్ని ఎత్తివేయాలని సర్కార్ యోచిస్తున్నట్లు సమాచారం. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ఫైలుపై CM రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని, త్వరలోనే ఉత్తర్వులు రానున్నట్లు తెలుస్తోంది. జనగణన విధులు ముగిశాకే రిలీవింగ్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారని టాక్. రెండేళ్ల సర్వీస్ పూర్తికాని వారికి ఈసారి ఛాన్స్ లేదు. అలాగే స్పౌజ్ కేటగిరీ, దివ్యాంగులకు టాప్ ప్రయారిటీ ఇవ్వనున్నారు.
News April 20, 2026
జూన్/జులైలో MPTC, ZPTC ఎన్నికలు?

TG: MPTC, ZPTC ఎన్నికలను జూన్ చివరి వారం లేదా జులైలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. గతంలో మే నెలలోనే జరపాలని అనుకున్నప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం జనాభా గణన చేపట్టనుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మే 11 నుంచి జూన్ 9 వరకు జనాభా గణన ప్రక్రియ కొనసాగనుంది. ఈలోగా ఓటర్ల జాబితా సవరణ కూడా పూర్తి చేయాల్సి ఉండటంతో యంత్రాంగం బిజీగా ఉంది.


