News July 11, 2024

SHOCK: టీలో పురుగుమందులు, ఎరువులు!

image

టీ పొడిలో పురుగుమందులు, ఎరువుల ఆనవాళ్లను కర్ణాటక హెల్త్ డిపార్ట్‌మెంట్ గుర్తించిందట. ఇప్పటికే మంచూరియా, కబాబ్, పీచు మిఠాయిల్లో కలరింగ్ ఏజెంట్లను నిషేధించింది. తాజాగా టీ స్టాళ్లపై దృష్టిపెట్టిన అధికారులు పలు జిల్లాల నుంచి టీపొడి శాంపిల్స్‌ పరిశీలించారట. మంచి రంగు కోసం టీడస్ట్‌ ప్రాసెసింగ్‌లో లిమిట్‌కి మించి పురుగుమందులు, ఎరువులు వాడుతున్నట్లు కనుగొన్నారని సమాచారం. అది క్యాన్సర్‌కు దారి తీస్తుందట.

Similar News

News January 20, 2025

కొత్త ఫోన్‌తో ఎర.. రూ.2.8 కోట్లు టోకరా

image

బెంగళూరులో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. లాటరీలో మొబైల్ గెలుచుకున్నారంటూ ఓ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్‌కి కొరియర్‌లో ఫోన్ పంపారు. నిజమేనని నమ్మిన అతను కొత్త ఫోన్‌లో సిమ్ వేశాడు. ఇదే అదనుగా నేరగాళ్లు మొబైల్‌ను తమ అధీనంలోకి తీసుకొని ఖాతా నుంచి రూ.2.8 కోట్ల నగదు కాజేశారు. మోసపోయానని ఆలస్యంగా గ్రహించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోలీసులను ఆశ్రయించాడు.

News January 20, 2025

సంజయ్ రాయ్‌కి నేడు శిక్ష ఖరారు

image

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్‌కి సీల్దా కోర్టు నేడు శిక్ష ఖరారు చేయనుంది. గతేడాది AUG 9న RGకర్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థినిని రేప్ చేసి చంపేశారు. ఈ కేసులో అక్కడ పనిచేసే సంజయ్ రాయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం 3 రోజుల క్రితం కోర్టు అతడిని దోషిగా తేల్చింది. అటు దీని వెనుక మరింత మంది ఉన్నారని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

News January 20, 2025

రద్దీగా మారిన హైదరాబాద్

image

నేటి నుంచి ఆఫీస్‌లు, పాఠశాలలు పూర్తిస్థాయిలో పనిచేయనున్న నేపథ్యంలో సంక్రాంతి పండగకు ఊరెళ్లిన ప్రజలు తెల్లవారుజామునే హైదరాబాద్‌లో వాలిపోయారు. వివిధ ప్రాంతాల నుంచి నిన్న రాత్రి బయల్దేరి మహానగరంలో అడుగుపెట్టారు. దీంతో మెట్రో రైళ్లు, RTC బస్సులు రద్దీగా ప్రయాణిస్తున్నాయి. MGBS, JBS సహా అమీర్‌పేట్, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్, LBనగర్ తదితర ప్రాంతాలు RTC, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులతో సందడిగా మారాయి.