News December 5, 2024
SHOCK: పుష్ప-2 సినిమా లీక్

భారీ స్థాయిలో విడుదలైన ‘పుష్ప-2’ అప్పుడే లీక్ అయింది. రిలీజై 24 గంటలు కాకముందే ఆన్లైన్లోని పైరసీ సైట్లలో సినిమా దర్శనమిస్తోంది. ఇంత త్వరగా సినిమా లీక్ అవడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. సుమారు రూ.500 కోట్లకు పైగా బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు.
Similar News
News January 7, 2026
టెన్త్ ఎగ్జామ్ ఫీజు చెల్లించేందుకు లాస్ట్ ఛాన్స్

TG: టెన్త్ ఎగ్జామ్స్ ఫీజు చెల్లించేందుకు విద్యాశాఖ చివరి అవకాశం కల్పించింది. తత్కాల్ విధానంలో ₹వెయ్యి లేట్ ఫీజుతో ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు చెల్లించవచ్చని చెప్పింది. ఆయా తేదీల్లో స్కూల్ HMలకు ఫీజులు చెల్లించాలని పేర్కొంది. హెడ్మాస్టర్లు 28వ తేదీ లోపు చలానా రూపంలో కట్టాలని, 29వ తేదీ లోపు ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాలంది. ఇదే చివరి అవకాశం అని, మరోసారి గడువు పొడిగించబోమని వివరించింది.
News January 7, 2026
శని ప్రభావంతో వివాహం ఆలస్యం

జాతక చక్రంలో వివాహ స్థానంపై శని ప్రభావం ఉంటే పెళ్లి ప్రయత్నాలు వాయిదా పడుతుంటాయి. శని మందగమన గ్రహం కావడంతో ప్రతి విషయంలోనూ జాప్యం జరుగుతుంది. దీనికి పరిష్కారంగా ప్రతి శనివారం శివాలయంలో నల్ల నువ్వులతో దీపారాధన చేయాలి. ‘శని గవచం’ పఠించడం, పేదలకు ఆహారం లేదా వస్త్ర దానం చేయడం వల్ల శని ప్రసన్నుడవుతాడు. ముఖ్యంగా హనుమంతుడిని పూజించడం వల్ల శని దోషాలు తొలగి, వివాహ మార్గం సుగమం అవుతుంది.
News January 7, 2026
NIT వరంగల్లో JRF పోస్టులు

<


