News December 5, 2024

SHOCK: పుష్ప-2 సినిమా లీక్

image

భారీ స్థాయిలో విడుదలైన ‘పుష్ప-2’ అప్పుడే లీక్ అయింది. రిలీజై 24 గంటలు కాకముందే ఆన్‌లైన్‌లోని పైరసీ సైట్లలో సినిమా దర్శనమిస్తోంది. ఇంత త్వరగా సినిమా లీక్ అవడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. సుమారు రూ.500 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు.

Similar News

News January 22, 2025

రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. MSP పెంపు

image

జనపనార (జూట్) రైతులకు మోదీ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. 2025-26 సీజన్‌కు గాను కనీస మద్దతు ధర (MSP)ను 6% అంటే క్వింటాకు రూ.315 మేర పెంచి రూ.5,650కి చేర్చింది. దీంతో దేశవ్యాప్తంగా జూట్ ఉత్పత్తిపై సగటు ఖర్చు కన్నా రైతుకు 66% ఎక్కువ రాబడి లభిస్తుంది. 2014-15లో రూ.2400గా ఉన్న క్వింటా ధరను కేంద్రం పదేళ్లలో 235 శాతానికి పెంచడం గమనార్హం. దేశవ్యాప్తంగా 40 లక్షల రైతు కుటుంబాలు జనపనార సాగు చేస్తున్నాయి.

News January 22, 2025

ఆ మూర్ఖులను కఠినంగా శిక్షించండి

image

పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో <<15226066>>మంటలొచ్చాయని<<>> వదంతులు సృష్టించిన మూర్ఖులను గుర్తించి కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రశాంతంగా వెళ్తోన్న రైలులో మంటలు చెలరేగాయని ప్రాంక్ చేసి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేయడం వల్లే అన్యాయంగా 8 మంది చనిపోయారని మండిపడుతున్నారు. వదంతులు సృష్టించిన వారిని శిక్షించి, ఇంకోసారి ఎవరూ ఇలా చేయకుండా భయాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

News January 22, 2025

ఆటో డ్రైవర్‌కు రూ.50,000?

image

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ తన ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్‌కు రూ.50 వేలు బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం. సరైన సమయంలో ఆస్పత్రికి తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 16న దొంగచేతిలో కత్తిపోట్లకు గురై తీవ్రంగా గాయపడిన ఈ హీరోను ఆటో డ్రైవర్ సమయానికి ఆసుపత్రికి చేర్చారు.