News December 31, 2024
రైతులకు షాక్.. DAP ధర పెంపు

దేశంలో DAP(డై అమ్మోనియం ఫాస్పేట్) ధర రేపటి నుంచి 50KGల బస్తాపై కనీసం ₹200 పెరగనుంది. DAP దిగుమతులకు కేంద్రం ఇప్పటివరకు అందించిన ప్రత్యేక ప్రోత్సాహకాల గడువు నేటితో ముగియనుంది. దీని పొడిగింపుపై ఎలాంటి ప్రకటన లేకపోవడం, డాలరుతో రూపాయి మారకం విలువ మరింత పెరగడంతో DAP ధర పెరగక తప్పదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. యూరియా తర్వాత రైతులు అత్యధికంగా DAP వినియోగిస్తారు. ప్రస్తుతం 50KGల బ్యాగ్ ధర ₹1350 ఉంది.
Similar News
News November 25, 2025
లిప్స్కీ LED మాస్క్

ప్రస్తుతం LED మాస్క్ల ట్రెండ్ కొనసాగుతోంది. ఇవి సౌందర్య పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. దీంతో లిప్స్కీ LED మాస్క్ వచ్చింది. దీన్ని నోటిపై పెట్టుకొని సపోర్ట్ హ్యాండిల్ని పళ్లతో పట్టుకోవాలి. డివైజ్ స్విచ్ ఆన్/ ఆఫ్ బటన్స్ ఉంటాయి. వీటిని వాడటం వల్ల పెదాలపై ఉండే ముడతలు, గీతలు పోయి అందంగా మెరుస్తాయి. ఇది ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ప్రయత్నించి చూడండి.
News November 25, 2025
ఆకుకూరల సాగుకు నేల తయారీ, ఎరువులు

ఆకుకూరల సాగు కోసం నేలను 3-4 సార్లు దున్ని చదును చేయాలి. పంటను బట్టి నేల తయారీలో ఎకరాకు 6-10 టన్నుల చివికిన పశువుల ఎరువు, 20 నుంచి 30 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 10-20 కిలోల యూరియా, పొటాష్ ఎరువులు వేసి నేలను సిద్ధం చేయాలి. తర్వాత అధిక వర్షాలకు నీరు ఇంకిపోయే విధంగా ఎత్తు మడులను, వాన నీరు నిల్వ ఉండకుండా నేలను తయారు చేసుకోవాలి. ఎత్తు మడుల వల్ల భారీ వర్షాలు కురిసినా పంటకు తక్కువ నష్టం జరుగుతుంది.
News November 25, 2025
జిల్లాల పునర్విభజనపై సీఎం సమీక్ష

AP: జిల్లాల <<18381213>>పునర్విభజన<<>>, డివిజన్లు, మండలాల మార్పుచేర్పులపై సీఎం చంద్రబాబు సమీక్షిస్తున్నారు. సచివాలయంలో జరుగుతున్న ఈ సమీక్షకు మంత్రులు అనగాని సత్యప్రసాద్, అనిత, నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటుపై ఇప్పటికే మంత్రుల కమిటీ అధ్యయనం చేసింది. వారు ఇచ్చిన నివేదికపై సీఎం కసరత్తు చేస్తున్నారు.


