News September 25, 2024
జానీ మాస్టర్కు షాక్.. పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి

TG: అత్యాచారం కేసులో జానీ మాస్టర్కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనను 4 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే జానీపై థర్డ్ డిగ్రీ ప్రయోగించొద్దని, న్యాయవాది సమక్షంలోనే విచారించాలని పోలీసులను ఆదేశించింది. జానీ బెయిల్ పిిటిషన్పై విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో ప్రస్తుతం ఆయన రిమాండ్లో ఉన్నారు.
Similar News
News October 19, 2025
APPLY NOW: BELలో 176 ఉద్యోగాలు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)176 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. వీటిలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్ -సి పోస్టులు ఉన్నాయి. వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. డిప్లొమా(ఇంజినీరింగ్), టెన్త్+ ITI అర్హతగల అభ్యర్థులు నవంబర్ 4 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://bel-india.in/ మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News October 19, 2025
ఇతిహాసాలు క్విజ్ – 40 సమాధానాలు

1. వాల్మీకి రామాయణంలో మొత్తం ‘24 వేల’ శ్లోకాలు ఉన్నాయి.
2. ‘యముడి’ అనుగ్రహం వల్ల కుంతీదేవికి ధర్మరాజు జన్మించాడు.
3. ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని ‘మాస శివరాత్రి’ అని అంటారు.
4. హనుమాన్ చాలీసాను రచించిన భక్తుడు ‘తులసీదాస్’.
5. భద్రాచలం రాముడి ఆలయాన్ని నిర్మించింది ‘కంచర్ల గోపన్న’.
<<-se>>#Ithihasaluquiz<<>>
News October 19, 2025
ప్రజల జీవితాల్లో చీకట్లు తొలగిపోయాయి: సీఎం

తెలంగాణ ప్రజలకు CM రేవంత్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. రెండేళ్ల ప్రజాపాలనలో ప్రజల జీవితాల్లో చీకట్లు తొలగిపోయాయని తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ వెలుగుల పండుగను రాష్ట్రంలోని ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని చెప్పారు. పర్యావరణానికి హాని కలిగించకుండా ఆనందంగా పండుగ జరుపుకోవాలని, ప్రమాదాలకు తావు లేకుండా జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.