News September 25, 2024
జానీ మాస్టర్‌కు షాక్.. పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి
TG: అత్యాచారం కేసులో జానీ మాస్టర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనను 4 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే జానీపై థర్డ్ డిగ్రీ ప్రయోగించొద్దని, న్యాయవాది సమక్షంలోనే విచారించాలని పోలీసులను ఆదేశించింది. జానీ బెయిల్ పిిటిషన్‌పై విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో ప్రస్తుతం ఆయన రిమాండ్‌లో ఉన్నారు.
Similar News
News October 11, 2024
ఆ రూ.లక్షన్నర కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు: కిషన్ రెడ్డి
TG: పేదల ఇళ్ల కూల్చివేతల విషయంలో హైడ్రా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం తగదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హితవు పలికారు. ‘ఇళ్లను కూల్చివేస్తే బ్యాంకు రుణాలు ఎవరు చెల్లిస్తారు? పేదలతో చర్చించి, వారికి ప్రత్యామ్నాయం చూపించాకే ముందుకు వెళ్లాలి. డ్రైనేజీ వ్యవస్థకు ప్రత్యామ్నాయం లేకుండా మూసీ సుందరీకరణ ఎలా సాధ్యం? మూసీ సుందరీకరణకు రూ.లక్షన్నర కోట్లను ప్రభుత్వం ఎక్కడి నుంచి సమీకరిస్తుంది’ అని ప్రశ్నించారు.
News October 11, 2024
APPLY NOW.. 2050 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు
TG: 2050 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ గడువు అక్టోబర్ 14వ తేదీతో ముగియనుంది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 16, 17 తేదీల్లో సవరణలు చేసుకోవచ్చు. నవంబర్ 23వ తేదీన పరీక్ష నిర్వహిస్తారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌లో అత్యధికంగా 1576 ఖాళీలున్నాయి. ఎంపికైన వారికి పేస్కేల్ రూ.36,750-రూ.1,06,990 ప్రకారం జీతాలు చెల్లిస్తారు. మరిన్ని వివరాలకు ఇక్కడ <
News October 11, 2024
సురేఖను తప్పిస్తారనేది ప్రత్యర్థుల ప్రచారమే: TPCC చీఫ్
TG: కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి తప్పిస్తారనేది ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారమేనని TPCC చీఫ్ మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. సమంత, నాగార్జున ఫ్యామిలీపై ఆమె చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారని చెప్పారు. ఆ వ్యవహారం అప్పుడే ముగిసిందని అన్నారు. AICC నేతలంతా బిజీగా ఉండటం వల్లే మంత్రి వర్గం, PCC కార్యవర్గం ఆలస్యమైందని తెలిపారు. దీపావళిలోపు రెండో విడత కార్పొరేషన్ పదవుల నియామకాలు పూర్తి చేస్తామన్నారు.