News February 1, 2025
SC, ST చట్టాన్ని దుర్వినియోగం చేసేవాళ్లకు షాక్!

SC, ST అట్రాసిటీ చట్టంపై <<15326115>>సుప్రీంకోర్టు<<>> వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది. ఈ చట్టం కింద నేర నిరూపణ జరగాలంటే నిందితుడు SC, ST వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా ప్రజాసమక్షంలో బహిరంగంగా దూషించినట్టు నిరూపించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. రక్షణ కోసం తెచ్చిన ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసేవాళ్లకిది చెంపపెట్టేనని విశ్లేషకులు అంటున్నారు. దీని ప్రకారం ఇకపై నకిలీ కేసులు తగ్గే అవకాశముందని పేర్కొంటున్నారు. మరి మీరేమంటారు?
Similar News
News January 2, 2026
గిగ్ వర్కర్లకు 90 రోజుల పని నిబంధన

గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు ప్రతిపాదించింది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకే అగ్రిగేటర్ వద్ద కనీసం 90 రోజులు, వేర్వేరు అగ్రిగేటర్ల వద్ద పనిచేసేవారు అయితే 120 రోజులు పని చేయాల్సి ఉంటుందని కేంద్ర కార్మిక శాఖ స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరూ ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని ఇప్పటికే కేంద్రం సూచించింది. అర్హులైన వారికి డిజిటల్ ఐడీ కార్డులను జారీ చేయనుంది.
News January 2, 2026
మరోసారి కనిపించిన కిమ్ కుమార్తె.. వారసత్వానికి సంకేతాలా?

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె కిమ్ జు యే మరోసారి బహిరంగంగా కనిపించి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు. నూతన సంవత్సరం సందర్భంగా తల్లిదండ్రులతో కలిసి ‘కుమ్‌సుసన్’ స్మారకాన్ని సందర్శించి దేశ మాజీ నేతలకు నివాళులు అర్పించారు. గత మూడేళ్లుగా తండ్రితో పాటు అధికారిక కార్యక్రమాల్లో జు యే పాల్గొంటుండటంతో ఆమెను వారసురాలిగా స్థానిక మీడియా పేర్కొంటోంది. ఇటీవల చైనా పర్యటనలోనూ కనిపించారు.
News January 2, 2026
NGRIలో ఉద్యోగాలు.. అప్లైకి 3రోజులే సమయం

హైదరాబాద్‌లోని CSIR-నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(NGRI)లో 13 సెక్యూరిటీ ఆఫీసర్, MTS పోస్టులకు అప్లై చేయడానికి 3రోజులే(జనవరి 5) సమయం ఉంది. సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుకు ఎక్స్‌సర్వీస్‌మన్, ఎంటీఎస్ పోస్టులకు టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ట్రేడ్ టెస్ట్/రాత పరీక్ష ద్వారా ఎంపికచేస్తారు. వెబ్‌సైట్: https://www.ngri.res.in/


