News February 1, 2025
SC, ST చట్టాన్ని దుర్వినియోగం చేసేవాళ్లకు షాక్!

SC, ST అట్రాసిటీ చట్టంపై <<15326115>>సుప్రీంకోర్టు<<>> వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది. ఈ చట్టం కింద నేర నిరూపణ జరగాలంటే నిందితుడు SC, ST వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా ప్రజాసమక్షంలో బహిరంగంగా దూషించినట్టు నిరూపించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. రక్షణ కోసం తెచ్చిన ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసేవాళ్లకిది చెంపపెట్టేనని విశ్లేషకులు అంటున్నారు. దీని ప్రకారం ఇకపై నకిలీ కేసులు తగ్గే అవకాశముందని పేర్కొంటున్నారు. మరి మీరేమంటారు?
Similar News
News February 13, 2025
APలో పెట్టుబడులు పెట్టండి.. తైవాన్‌కు మంత్రి లోకేశ్ ఆహ్వానం

AP: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని తైవాన్ ప్రతినిధులను మంత్రి లోకేశ్ కోరారు. త్వరితగతిన అనుమతులు ఇప్పిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, ఫుట్‌వేర్ రంగాల్లో తైవాన్ అగ్రగామిగా ఉందని, APలోనూ ఆ రంగాలను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఆయన వారితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా AP అభివృద్ధి కోసం తీసుకొచ్చిన విధానాల్ని వివరించారు.
News February 13, 2025
ఒంగోలు ఆవుకు రూ.41 కోట్లు.. సీఎం స్పందనిదే

ఒంగోలు జాతి గిత్తలు, ఆవులను రక్షించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇటీవల బ్రెజిల్‌లో నిర్వహించిన వేలంలో ఆ జాతికి చెందిన వయాటినా-19 అనే ఆవు <<15364444>>రూ.41 కోట్లు<<>> పలకడం శుభపరిణామమన్నారు. దీనివల్ల రాష్ట్ర పశుసంవర్ధక వారసత్వం ప్రపంచానికి తెలిసిందని చెప్పారు. ఆ జాతి గిత్తలు ఉన్నతమైనవని, బలానికి ప్రసిద్ధి చెందాయని పేర్కొన్నారు.
News February 13, 2025
మార్చి 31న బ్యాంకులకు సెలవు లేదు: RBI

మార్చి 31వ తేదీన దేశంలోని బ్యాంకులకు సెలవు రద్దు చేస్తూ RBI నిర్ణయం తీసుకుంది. ఆ రోజున ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంది. అయితే ఆర్థిక సంవత్సరం చివరి తేదీ కావడంతో అన్ని లావాదేవీలు పూర్తి కావాలనే ఉద్దేశంతో RBI ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ మార్చి 31న సెలవు ఇస్తే లావాదేవీలన్నీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో అన్ని బ్యాంకులు ఆ రోజు పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది.