News February 3, 2025

SHOCKING: సీఎం చంద్రబాబు భూమి స్వాహాకు యత్నం!

image

AP: భూమాఫియా బరితెగించింది. ఏకంగా CM చంద్రబాబు స్థలంపైనే కన్నువేసింది. 25 ఏళ్ల కిందట బాపట్లలో TDP ఆఫీస్ కోసం ఓ వ్యక్తి CBN పేరిట 9.5 సెంట్లు రిజిస్టర్ చేయించారు. కాలక్రమంలో దీని విలువ రూ.1.50 కోట్లకు చేరడంతో అక్రమార్కులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. తాజాగా ఆ పత్రాలతో బ్యాంకు రుణం కోసం ప్రయత్నించగా మోసం బయటపడింది. బాపట్ల MLA ఫిర్యాదుతో సత్తార్‌రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

Similar News

News January 18, 2026

స్వర్గలోక ప్రాప్తి కోసం నేడు ఏం చేయలంటే?

image

చొల్లంగి అమావాస్య నాడు పితృదేవతలకు మోక్షం ప్రసాదించడానికి నదీ స్నానం చేయాలి. పితృ తర్పణాలు, పిండ ప్రదానాలు చేస్తే మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ‘నువ్వులు నింపిన రాగి పాత్రను, వస్త్రాలను, అన్నాన్ని పేదలకు లేదా బ్రాహ్మణులకు దానం చేయాలి. మౌనవ్రతం పాటిస్తూ శివారాధన చేయడం వల్ల సకల జాతక దోషాలు తొలగి పుణ్యగతులు లభిస్తాయి. రుద్రాభిషేకంతో మంచి ఫలితాలుంటాయి. నవగ్రహాల ప్రదక్షిణ మంచిది’ అంటున్నారు.

News January 18, 2026

నేడు చొల్లంగి అమావాస్య.. ఈ ఒక్క పని చేస్తే!

image

ఈరోజు చొల్లంగి అమావాస్య. ఈ పవిత్ర దినాన తూ.గో(D) చొల్లంగి వద్ద ఉన్న సాగర సంగమంలో(గోదావరి నది) స్నానమాచరిస్తే పాపాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. నేడు నదీ స్నానాలు చేసి, పితృ తర్పణాలు వదిలితే వంశాభివృద్ధి, 21 తరాల పితృదేవతలకు నరక విముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈరోజే సప్త సాగర యాత్ర మొదలవుతుంది. స్వర్గలోక ప్రాప్తి సిద్ధించడానికి నేడు ఏం చేయాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.

News January 18, 2026

పశువుల రవాణా.. ఈ సర్టిఫికెట్స్ తప్పక ఉండాలి

image

పశువులను ఒక ప్రాంతంలో కొని మరో ప్రాంతానికి తరలించేటప్పుడు కొన్ని సర్టిఫికెట్స్‌ను మన దగ్గర ఉంచుకొని సంబంధిత అధికారులు అడిగితే చూపాలి. జీవాల కొనుగోలు, అమ్మకం రసీదు, జీవాల వయసు, ఆరోగ్యం, వాటి విలువ తెలియజేసే సర్టిఫికెట్‌ను కొనుగోలు చేసిన ప్రాంత పశువైద్యాధికారి నుంచి తీసుకోవాలి. పశువులను ఏ వాహనంలో ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎవరికి రవాణా చేస్తున్నారో తెలిపే రవాణా సర్టిఫికెట్‌ను కూడా మన దగ్గర ఉంచుకోవాలి.