News March 21, 2025
SHOCKING: మాంసం, హలీం తింటున్నారా?

TG: HYDలోని పలు హోటళ్లలో కుళ్లిన మాంసం ప్రజలను హడలెత్తిస్తోంది. ఇటీవల మంగళ్హట్లో అధికారులు 12 టన్నుల మేక మాంసాన్ని సీజ్ చేయగా, ఇవాళ డబీర్పురలో 2 టన్నుల మటన్ను గుర్తించారు. పాడైన మేక, గొర్రె మాంసాన్ని వివాహాలు, హోటళ్లకు సరఫరా చేస్తున్న నిందితుడు మిస్సాహుద్దీన్ను అరెస్ట్ చేశారు. వరుస ఘటనల నేపథ్యంలో మటన్, హలీం ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుళ్లిన మాంసం సరఫరాను అరికట్టాలని కోరుతున్నారు.
Similar News
News January 19, 2026
ఏ క్షణమైనా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్!

TG: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం అందించిన రిజర్వేషన్ల సమాచారాన్ని SEC వెబ్సైట్లో పొందుపరిచింది. నిన్న మేడారంలో జరిగిన క్యాబినెట్ భేటీలో మున్సి‘పోల్స్’కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తెలిసిందే. FEB 14 నుంచి ఈ ఎన్నికలు జరగవచ్చన్న ఊహాగానాలు వెలువడ్డాయి. ఇపుడు SEC రిజర్వేషన్లను ప్రకటించడంతో ఏ క్షణమైన ఎన్నికల షెడ్యూల్ వెలువడవచ్చని స్పష్టమవుతోంది.
News January 19, 2026
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!

వారానికి 5 రోజుల పని విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 27న దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. దీనికి ముందు వరుసగా 3 రోజులు సెలవులున్నాయి. జనవరి 24 (నాలుగో శనివారం), 25 (ఆదివారం), 26 (గణతంత్ర దినోత్సవం) సెలవులు కాగా 27న సమ్మె జరగనుంది. దీంతో వరుసగా 4 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంక్ పనులుంటే ముందే ప్లాన్ చేసుకోవడం బెటర్.
News January 19, 2026
వందే భారత్ స్లీపర్ టికెట్లకు కొత్త నిబంధనలు

వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కిన వేళ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ట్రైన్లో టికెట్ క్యాన్సిలేషన్ రూల్స్ను మరింత కఠినతరం చేసింది. 72 గంటలకు ముందు టికెట్ రద్దు చేస్తే 25%, 72 నుంచి 8 గంటల మధ్య క్యాన్సిల్ చేస్తే 50% ఛార్జ్ కట్ అవుతుంది. 8 గంటలలోపు రద్దు చేస్తే ఒక్క రూపాయి కూడా రిఫండ్ ఉండదు. వందేభారత్ స్లీపర్లో RAC, వెయిటింగ్ లిస్ట్ ఉండవని ఇప్పటికే రైల్వే శాఖ స్పష్టం చేసింది.


