News May 10, 2024
ప్రజ్వల్ రేవణ్న కేసులో షాకింగ్ ట్విస్ట్!

కర్ణాటక JDS MP ప్రజ్వల్ రేవణ్న కేసులో షాకింగ్ విషయం వెలుగుచూసింది. పోలీసులమని చెప్పి తనతో పలువురు బలవంతంగా ఫేక్ కేసు పెట్టించారని ఓ మహిళ ఆరోపించారు. దీనిపై JDS చీఫ్ కుమారస్వామి స్పందించారు. ఫిర్యాదు చేయకపోతే వ్యభిచారం కేసు పెడతామని బాధిత మహిళల్ని సిట్ అధికారులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు ఈ కేసులో 700 మంది మహిళలు తమకు ఫిర్యాదు చేసినట్లు వస్తున్న వార్తల్ని జాతీయ మహిళా కమిషన్ ఖండించింది.
Similar News
News February 8, 2025
రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమా కథ ఇదేనా?

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోడి రామ్మూర్తి జీవిత కథ ఆధారంగా తీస్తున్నారని తొలుత ప్రచారం నడిచింది. అయితే సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తాజాగా కథ గురించి హింట్ ఇచ్చారు. ‘రాత్రుళ్లు షూటింగ్, ఫ్లడ్ లైట్లు, పవర్ క్రికెట్, విచిత్రమైన కోణాలు’ అని ట్వీట్ చేశారు. దీంతో రెండు ఊళ్ల మధ్య జరిగే క్రికెట్ ఆధారంగా మూవీ కథ ఉంటుందని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
News February 8, 2025
అనూహ్యం.. ముస్లింల ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యం

ఢిల్లీలోని ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తొలుత ఆప్ ఆధిక్యం కనబరిచిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఆయా స్థానాల్లో బీజేపీ దూసుకొచ్చింది. మొత్తం 12 స్థానాల్లో ప్రస్తుతం 7 చోట్ల బీజేపీ లీడింగ్‌లో ఉంది. దీంతో ఆప్, కాంగ్రెస్‌ని కూడా ముస్లింలు ఆదరించలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
News February 8, 2025
కాంగ్రెస్ దుస్థితి: జీరో, జీరో.. మరో జీరో లోడింగ్!

ఢిల్లీ అసెంబ్లీకి 1952-2020 మధ్య ఎనిమిదిసార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 4సార్లు గెలిచింది. అలాంటి పార్టీ ఇప్పుడు అక్కడ ఖాతా తెరవడానికి ఆపసోపాలు పడుతోంది. 2015, 2020 ఎన్నికల్లో సున్నాకే పరిమితమైన గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఈసారీ పేలవ ప్రదర్శన చేస్తోంది. కేవలం ఒకేఒక్కచోట స్వల్ప ఆధిక్యతతో ఊగిసలాడుతోంది. పూర్తి కౌంటింగ్ ముగిసే సమయానికి ఆ స్థానమూ డౌటేనని అంచనా. దీంతో హ్యాట్రిక్ డకౌట్ ఖాయంగా కనిపిస్తోంది.