News February 2, 2025
SHOCKING: భర్త కిడ్నీ అమ్మేసి ప్రియుడితో పరారైన భార్య!

ఆమెకు పెళ్లై ఓ కూతురు ఉంది. అయినా ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తిని ప్రేమించింది. అతడితో కలిసి పారిపోవాలనుకుంది. అలా వెళ్లిపోతే ఒకెత్తు. కానీ మరీ అన్యాయంగా భర్త కిడ్నీని భర్తతోనే విక్రయింపచేసింది. కూతురి జీవితానికి ఆ డబ్బులు ఉపయోగపడతాయని నమ్మబలికింది. ఆమెను నమ్మిన భర్త కిడ్నీ అమ్మేసి రూ.10 లక్షలు ఇచ్చాడు. ఆ డబ్బును తీసుకుని ప్రియుడితో పరారైందా ఇల్లాలు. బెంగాల్‌లోని హౌరా జిల్లాలో ఈ ఘటన జరిగింది.
Similar News
News November 25, 2025
విశాఖలో ఇండియా VS సౌతాఫ్రికా మ్యాచ్.. చురుగ్గా ఏర్పాట్లు

విశాఖలోని ACA VDCA క్రికెట్ స్టేడియంలో డిసెంబర్ 6న ఇండియా VS సౌతాఫ్రికా వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు క్రికెట్ అసోసియేషన్ ఏర్పాట్లు చేస్తోంది. సుమారు 22 వేల టికెట్లను అమ్మకానికి అందుబాటులో ఉంచనున్నారు. విశాఖలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరుగుతుండటంతో క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ ఏర్పాట్లపై కలెక్టర్, సీపీ, ఏసీఏ-వీడీసీఏ మైదానంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు.
News November 25, 2025
మున్సిపల్ వాటర్‌తో బెంజ్ కారు కడిగాడు.. చివరకు!

TG: చాలా మంది వాటర్ బోర్డ్ సరఫరా చేసే తాగునీటితోనే యథేచ్ఛగా వాహనాలను కడిగేస్తుంటారు. HYD బంజారాహిల్స్ రోడ్ నం.12లో అలా చేసిన ఓ వ్యక్తికి అధికారులు రూ.10వేల జరిమానా విధించారు. వాటర్ బోర్డ్ ఎండీ అశోక్ రెడ్డి రోడ్డుపై వెళ్తుండగా నీటితో కారు కడగడాన్ని గమనించారు. వెంటనే అతడికి ఫైన్ వేయాలని అధికారులను ఆదేశించారు. తాగునీటిని ఇతర అవసరాలకు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని నగరవాసులను హెచ్చరించారు.
News November 25, 2025
T20 WC: గ్రూపుల వారీగా జట్లు

టీ20 ప్రపంచకప్-2026లో మొత్తం 20 జట్లు తలపడనున్నాయి. వాటిని 4 గ్రూపులుగా విభజించారు. గ్రూప్-Aలో భారత్, పాకిస్థాన్, నమీబియా, నెదర్లాండ్స్, USA ఉన్నాయి. పై 4 గ్రూపుల్లో ఏది టఫ్‌గా ఉందో కామెంట్ చేయండి.
టీమ్ ఇండియా గ్రూప్ మ్యాచుల షెడ్యూల్ ఇలా:
*ఫిబ్రవరి 7న ముంబైలో USAతో, 12న ఢిల్లీలో నమీబియాతో, 15న కొలంబోలో పాకిస్థాన్‌తో, 18న అహ్మదాబాద్‌లో నెదర్లాండ్స్‌తో భారత్ ఆడనుంది.


