News February 2, 2025
SHOCKING: భర్త కిడ్నీ అమ్మేసి ప్రియుడితో పరారైన భార్య!

ఆమెకు పెళ్లై ఓ కూతురు ఉంది. అయినా ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తిని ప్రేమించింది. అతడితో కలిసి పారిపోవాలనుకుంది. అలా వెళ్లిపోతే ఒకెత్తు. కానీ మరీ అన్యాయంగా భర్త కిడ్నీని భర్తతోనే విక్రయింపచేసింది. కూతురి జీవితానికి ఆ డబ్బులు ఉపయోగపడతాయని నమ్మబలికింది. ఆమెను నమ్మిన భర్త కిడ్నీ అమ్మేసి రూ.10 లక్షలు ఇచ్చాడు. ఆ డబ్బును తీసుకుని ప్రియుడితో పరారైందా ఇల్లాలు. బెంగాల్‌లోని హౌరా జిల్లాలో ఈ ఘటన జరిగింది.
Similar News
News February 12, 2025
పబ్లిక్‌లో పొట్టి దుస్తులు ధరించడం నేరం కాదు: ఢిల్లీ కోర్టు

బార్‌లో అశ్లీల నృత్యం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు మహిళలను ఢిల్లీ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. బహిరంగంగా పొట్టి దుస్తులు ధరించడం నేరం కాదంది. వారి డాన్స్ ప్రజలకు చిరాకు కలిగిస్తేనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. పొట్టి దుస్తులు ధరించి అశ్లీల డాన్స్ చేశారంటూ గత ఏడాది పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే దీనివల్ల ఇబ్బందిపడిన సాక్షులను ప్రవేశపెట్టడంలో విఫలమయ్యారని కోర్టు పేర్కొంది.
News February 12, 2025
పడిపోయిన ఎలాన్ మస్క్ ఆస్తి

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆస్తి 400 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయింది. టెస్లా షేర్ల విలువ 27శాతం పడిపోవడమే దీనికి ప్రధాన కారణం. సంస్థ కార్ల అమ్మకాలు భారీగా తగ్గడం దాని షేర్ల విలువపై ప్రభావం చూపించింది. గడచిన వారంలో 11శాతం మేర షేర్ల విలువ పడిపోవడం గమనార్హం. డోజ్ శాఖ ద్వారా అమెరికా ప్రభుత్వ పెట్టుబడుల్ని ఆయన తగ్గించడం టెస్లా ఇన్వెస్టర్లకు నచ్చడం లేదని బిజినెస్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
News February 12, 2025
బూతులతో రెచ్చిపోయిన నటుడు పృథ్వీ

హైబీపీతో బాధపడుతూ HYDలోని ఓ <<15429041>>ఆస్పత్రిలో చేరిన<<>> నటుడు పృథ్వీరాజ్ వైసీపీ శ్రేణులపై బూతులతో రెచ్చిపోయారు. ‘11 అనే మాట వస్తే వైసీపీ వాళ్లు గజగజ వణికిపోతున్నారు. సినిమాను సినిమాగా చూడండి. నా తల్లిని నీచంగా మాట్లాడుతున్నారు కదరా’ అంటూ రాయడానికి వీలులేని తీవ్ర అసభ్య పదజాలంతో దుయ్యబట్టారు. కాగా ‘లైలా’ సినిమా ప్రీరిలీజ్ వేడుకలో పృథ్వీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే.