News September 15, 2024
విజయవాడలో ‘వీరమల్లు’ షూటింగ్?

‘హరి హర వీరమల్లు’ మూవీ చివరి దశ చిత్రీకరణకు రంగం సిద్ధమైంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఆయనకు వీలుగా విజయవాడ పరిసరాల్లో బ్లూమ్యాట్ను రెడీ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే వారం నుంచే షూటింగ్ మొదలవుతుందని సమాచారం. పవర్ స్టార్ పాత్రకు సంబంధించి 20 రోజుల షూట్ పూర్తికాగానే విడుదల తేదీపై ఓ స్పష్టత వస్తుందని టాక్. క్రిష్ తప్పుకోవడంతో జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.
Similar News
News October 25, 2025
వరుస డకౌట్ల తర్వాత కోహ్లీ హాఫ్ సెంచరీ

ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో కోహ్లీ హాఫ్ సెంచరీ బాదారు. 56 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో అర్ధశతకం పూర్తి చేసుకున్నారు. ఆయనకు ఇది 75వ హాఫ్ సెంచరీ. తొలి 2 వన్డేల్లో డకౌట్ల తర్వాత విరాట్ ఫామ్ అందుకోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రోహిత్ సెంచరీ వైపు దూసుకెళ్తున్నారు. ఆయన 80కి చేరువలో ఉన్నారు. వీరిద్దరూ నిలకడగా ఆడుతుండటంతో భారత్ విజయం వైపు పయనిస్తోంది. గెలుపుకు మరో 66 రన్స్ కావాలి.
News October 25, 2025
టెన్త్ పబ్లిక్ పరీక్షలపై సన్నాహాలు షురూ

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షలపై విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. మార్చిలో వీటిని చేపట్టేలా ప్రణాళిక రూపొందిస్తోంది. మార్చి 16నుంచి ఆరంభించాలని ఎస్సెస్సీ బోర్డు ప్రతిపాదించింది. అయితే ఇంటర్మీడియెట్ పరీక్షలు FEB 23 నుంచి MAR 24 వరకు జరుగుతాయి. కెమిస్ట్రీ వంటి ముఖ్య సబ్జెక్టు పేపర్లు 17వ తేదీ వరకు ఉన్నాయి. దీంతో టెన్త్ పరీక్షలు ఏ తేదీ నుంచి ప్రారంభమవుతాయనే దానిపై ఆ శాఖ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
News October 25, 2025
ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్: 6 నెలల్లో 30 వేల మంది బాధితులు

దేశంలో ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్కు వేలాది మంది బాధితులుగా మారుతున్నారు. గత 6 నెలల్లో ఏకంగా 30 వేల మంది రూ.1,500 కోట్లకు పైగా నష్టపోయారని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ వెల్లడించింది. బాధితుల్లో 30-60 ఏళ్ల వారే ఎక్కువని, 65% స్కామ్స్ ఢిల్లీ-NCR, బెంగళూరు, హైదరాబాద్లోనే నమోదయ్యాయని చెప్పింది. 26.38%తో బెంగళూరు తొలిస్థానంలో ఉందని, ఢిల్లీలో సగటున ఒక్కొక్కరు 8 లక్షలు నష్టపోయారని పేర్కొంది.


