News September 15, 2024

విజయవాడలో ‘వీరమల్లు’ షూటింగ్?

image

‘హరి హర వీరమల్లు’ మూవీ చివరి దశ చిత్రీకరణకు రంగం సిద్ధమైంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఆయనకు వీలుగా విజయవాడ పరిసరాల్లో బ్లూమ్యాట్‌ను రెడీ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే వారం నుంచే షూటింగ్ మొదలవుతుందని సమాచారం. పవర్ స్టార్ పాత్రకు సంబంధించి 20 రోజుల షూట్ పూర్తికాగానే విడుదల తేదీపై ఓ స్పష్టత వస్తుందని టాక్. క్రిష్ తప్పుకోవడంతో జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

Similar News

News October 9, 2024

బ్యాటరీ పర్సంటేజ్‌తో ఈసీకి కాంగ్రెస్ అభ్యర్థుల ఫిర్యాదు

image

హరియాణాలోని మహేంద్రగఢ్, పానిపట్‌లలో కాంగ్రెస్ అభ్యర్థులు ఈవీఎం బ్యాటరీల పర్సంటేజ్‌తో ఈసీకి ఫిర్యాదు చేశారు. EVMలలో 99% బ్యాటరీ ఉన్నచోట BJP, 60-70% ఉన్నచోట కాంగ్రెస్ లీడ్‌లో ఉందని, కుట్ర జరిగిందని ఆరోపించారు. దీనిపై ఈసీ స్పందిస్తూ ‘EVMలలో ఆల్కలీన్ బ్యాటరీలు వాడుతున్నాం. ఇది వోల్టేజీని బట్టి పర్సంటేజ్ తక్కువగా చూపిస్తుంది. ఫలితాలకు బ్యాటరీకి సంబంధం లేదు’ అని పేర్కొంది.

News October 9, 2024

రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే ఇలా చేయండి

image

రోజంతా చురుగ్గా ఉండాలని చాలామంది కోరుకుంటారు. అలా ఉత్సాహంగా ఉండాలంటే మానసిక, శారీర ఆరోగ్యం బాగుండాలి. అందుకోసం ప్రతిరోజు కాసేపు యోగా చేయడం అలవాటు చేసుకోవాలి. టిఫిన్ స్కిప్ చేయొద్దు. ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. రోజూ పుష్కలంగా నీళ్లు తాగాలి. సమయానికి నిద్రపోవాలి. రాత్రి భోజనానికి, నిద్రకు మధ్య రెండు గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి.

News October 9, 2024

ఆ విద్యార్థులకు పాత సిలబస్‌తో పబ్లిక్ ఎగ్జామ్స్

image

AP: పదో తరగతి 2021-22, 2022-23, 2023-24 విద్యాసంవత్సరాల్లో చదివి ఫెయిల్ అయిన ప్రైవేట్, రీ ఎన్‌రోల్ విద్యార్థులకు పాత సిలబస్ ప్రకారమే పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు SSC పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న వారికి కొత్త సిలబస్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయన్నారు. క్వశ్చన్ పేపర్స్, మోడల్ పేపర్స్ పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో ఉంచామని తెలిపారు.