News September 28, 2024
ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నారా.. ఇది కూడా పరిశీలించండి
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ బ్రాండ్స్ ప్రైస్ వార్‌కు తెరలేపాయి. ఈ-కామర్స్‌లకు ధీటుగా షావోమీ, శాంసంగ్ లాంటి సంస్థలు తమ సొంత ఆన్‌లైన్ స్టోర్స్‌లో కూడా సేల్స్ ప్రారంభించాయి. ఈ-కామర్స్ కంటే అధిక ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు, ఏ బ్యాంక్ కార్డుపై అయినా ధరల తగ్గింపు ఇస్తున్నాయి. కాబట్టి షాపింగ్ చేసే ముందు ఈ-కామర్స్, ప్రొడక్ట్ సంస్థ పోర్టల్‌లో ధరలు చెక్ చేసుకోండి. SHARE IT.
Similar News
News October 5, 2024
TENTH: రెండు రోజులపాటు సైన్స్ ఎగ్జామ్
TG: పదో తరగతి వార్షిక పరీక్షల్లో జనరల్ సైన్స్ పేపర్‌ను రెండు రోజులపాటు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఫిజికల్ సైన్స్, బయాలజీ పేపర్లను ఇప్పటివరకు ఒకే రోజు నిర్వహిస్తూ వచ్చారు. ఇక నుంచి వేర్వేరు రోజుల్లో నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో పేపర్‌కు ఎప్పటిలాగే 1.30hrs సమయం ఇవ్వనున్నట్లు తెలిపింది. కరోనా సంక్షోభం తర్వాత టెన్త్ పేపర్లను 11నుంచి 6కు కుదించిన సంగతి తెలిసిందే.
News October 5, 2024
WARNING: ఈ నంబర్ నుంచి కాల్ వస్తే లిఫ్ట్ చేయొద్దు!
పాకిస్థాన్ నుంచి సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్స్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. +92తో ప్రారంభమయ్యే నంబర్ల నుంచి కాల్ వస్తే లిఫ్ట్ చేయొద్దంటున్నారు. పోలీస్ యూనిఫాంలో ఉన్న ఫొటోలను డీపీగా పెట్టుకుని చీట్ చేస్తారని, నమ్మితే మోసపోతారని హెచ్చరిస్తున్నారు. ఆగ్రాకు చెందిన ఓ మహిళను ఇలాగే మోసగించడంతో <<14268213>>ఆమె<<>> గుండెపోటుతో మరణించింది. >>SHARE IT
News October 5, 2024
బతుకమ్మ అంటే ఈ ముఖ్యమంత్రికి గిట్టదా?: KTR
TG: బతుకమ్మ పండుగ వేళ గ్రామాల్లో చెరువు వద్ద లైట్లు పెట్టడానికి, పరిశుభ్రత కోసం బ్లీచింగ్ పౌడర్ కొనడానికి డబ్బుల్లేని పరిస్థితులు దాపురించాయని KTR అన్నారు. ‘బతుకమ్మ అంటే గిట్టదా, పట్టదా ఈ ముఖ్యమంత్రికి? ఆడబిడ్డల వేడుకకు ఏర్పాట్లు చేయడానికి మనసు రావట్లేదా? బతుకమ్మ చీరలను రద్దు చేశారు. ఇప్పుడు ఉత్సవాలను ఘనంగా చేసుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారా?’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని X వేదికగా ప్రశ్నించారు.