News March 2, 2025
నేటి నుంచి 24 గంటలు షాపులు ఓపెన్

TG: రంజాన్ మాసం సందర్భంగా నేటి నుంచి 24 గంటలు షాపులు తెరిచి ఉండనున్నాయి. ఈ నెల 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ వెసులుబాటు కల్పిస్తూ గత నెలలోనే సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే షాపులు, వ్యాపార సముదాయాల్లో పని చేసే సిబ్బంది రోజుకు 8 గంటలు లేదా వారానికి 48 గంటలకు మించి పని చేస్తే యాజమాన్యం రెట్టింపు జీతం చెల్లించాలని పేర్కొంది. సెలవుల్లో పని చేస్తే ప్రత్యామ్నాయ లీవ్ ఇవ్వాలని ఆదేశించింది.
Similar News
News March 17, 2025
‘ఫ్యామిలీ రూల్’పై అనుష్క శర్మ పోస్ట్.. వైరల్

బీసీసీఐ ప్రవేశపెట్టిన ‘ఫ్యామిలీ రూల్’పై టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ పరోక్షంగా స్పందించారు. ‘నువ్వు తెలిసిన ప్రతి ఒక్కరి మనసులో నీ గురించి వేర్వేరు అభిప్రాయాలు ఉంటాయి. కానీ నువ్వేంటో నీకు మాత్రమే తెలుసు’ అంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కాగా టూర్లలో క్రికెటర్లతోపాటు వారి కుటుంబాలు, సన్నిహితులు ఉంటే బాగుంటుందని విరాట్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
News March 17, 2025
అత్యధిక పన్ను చెల్లించే నటుడు ఎవరంటే?

బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇన్కమ్‌ట్యాక్స్ చెల్లించడంలో ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ఆయన అడ్వాన్స్ ట్యాక్స్ రూ.52.50కోట్లు చెల్లించినట్లు సినీవర్గాలు తెలిపాయి. కాగా, 2024-2025 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ.350 కోట్లు సంపాదించినట్లు పేర్కొన్నాయి. తద్వారా రూ.120 కోట్లు పన్ను చెల్లించి అత్యధికంగా పన్ను చెల్లించిన నటుడిగా నిలిచినట్లు వెల్లడించాయి. 85 సంవత్సరాల వయసులోనూ ఆయన ఎంతో డిమాండ్ ఉన్న నటుడిగా ఉన్నారు.
News March 17, 2025
11 మంది సెలబ్రిటీలపై కేసులు

TG: బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న పలువురు సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. 11 మందిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. విష్ణుప్రియ, సుప్రిత, రీతూ చౌదరి, హర్షసాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, శ్యామల, కిరణ్ గౌడ్, సన్నీ యాదవ్, సుధీర్ రాజు, అజయ్‌పై కేసులు నమోదయ్యాయి.