News May 21, 2024
’10KGల గోధుమ పిండి వారంలో తినాలా?’ ZEPTOపై యూజర్ ఫైర్

ZEPTOలో ఆర్డర్ చేసిన ఢిల్లీకి చెందిన గజేంద్ర యాదవ్‌కు ఎక్స్పైరీ తేదీకి దగ్గరగా ఉన్న గోధుమ పిండి వచ్చింది. 10KGల ప్యాకెట్‌ను 8 రోజుల్లో ఎలా పూర్తి చేయాలో చెప్పాలని ZEPTOను ట్యాగ్ చేశాడు. కస్టమర్ కేర్ నుంచీ సరైన ఆన్సర్ రాలేదు. చిర్రెత్తుకొచ్చిన అతడు.. ‘గోధుమపిండిని వృథా చేయను. మీ ఆఫీసుకు పంపిస్తా’ అని పోస్ట్ చేసి, ZEPTO వ్యవస్థాపకులకు ట్యాగ్ చేశాడు. దీంతో సంస్థ దిగొచ్చి అతడికి రీఫండ్ ఇచ్చింది.
Similar News
News December 4, 2025
HYD: త్రివిధ దళాల్లో నౌకాదళం శక్తిమంతం: రంగారావు

త్రివిధ దళాల్లో నౌకాదళం శక్తివంతమైందని, దేశ రక్షణలో కీలకమని నేవీ విశ్రాంత ఆఫీసర్ DP రంగారావు అన్నారు. ‘1969-80 వరకు పని చేశాను. 1971 WARలో ఉన్నాను. 1970-76లో ఒకే షిప్లో 6 ఏళ్లు 28 దేశాలు ప్రయాణించాను. 1976లో INS వీరబాహు సబ్ మెరైన్ బేస్ మెయింటెనెన్స్ మెరైన్ ఇంజినీర్‌గా విధులు నిర్వహించాను. సంగ్రామ్ మెడల్, పశ్చిమ స్టార్ మెడల్స్ అందుకున్నాను’ అని నేవీ డే వేళ హయత్‌నగర్‌లో ఆయన Way2Newsతో మాట్లాడారు.
News December 4, 2025
డిగ్రీ లేకపోయినా ఉద్యోగమిస్తా: జోహో CEO

జోహో సీఈవో శ్రీధర్ వెంబు సూపర్ ఆఫర్ ఇచ్చారు. నైపుణ్యం ఉంటే చాలని.. డిగ్రీ లేకుండానే ఉద్యోగం ఇస్తానని ప్రకటించారు. పిల్లలపై ఒత్తిడి పెట్టడం మానాలని భారతీయ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. అమెరికాలో యువత డిగ్రీ వదిలి నేరుగా ఉద్యోగాలను ఎంచుకుంటున్న ధోరణిని ఉదాహరణగా చూపించారు. Zohoలో ఏ ఉద్యోగానికీ డిగ్రీ క్రైటీరియా లేదని తెలిపారు. తనతో పనిచేస్తున్న టీమ్‌లో సగటు వయస్సు 19 ఏళ్లు మాత్రమేనని అన్నారు.
News December 4, 2025
ఎల్లుండి నుంచి APP పరీక్షల హాల్ టికెట్లు

TG: 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) పోస్టుల పరీక్షా హాల్ టికెట్లను ఈ నెల 6వ తేదీ ఉ.8గం. నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని TSLPRB ప్రకటించింది. 13వ తేదీ రాత్రి 12గం. వరకు సైట్లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈనెల 14న రాత పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. ఉ.10గం. నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్-1(ఆబ్జెక్టివ్), మధ్యాహ్నం 2.30 నుంచి 5.30గం. వరకు పేపర్-2(డిస్క్రిప్టివ్) ఉంటాయని తెలిపింది.


