News May 21, 2024

’10KGల గోధుమ పిండి వారంలో తినాలా?’ ZEPTOపై యూజర్ ఫైర్

image

ZEPTOలో ఆర్డర్ చేసిన ఢిల్లీకి చెందిన గజేంద్ర యాదవ్‌కు ఎక్స్‌పైరీ తేదీకి దగ్గరగా ఉన్న గోధుమ పిండి వచ్చింది. 10KGల ప్యాకెట్‌ను 8 రోజుల్లో ఎలా పూర్తి చేయాలో చెప్పాలని ZEPTOను ట్యాగ్ చేశాడు. కస్టమర్ కేర్ నుంచీ సరైన ఆన్సర్ రాలేదు. చిర్రెత్తుకొచ్చిన అతడు.. ‘గోధుమపిండిని వృథా చేయను. మీ ఆఫీసుకు పంపిస్తా’ అని పోస్ట్ చేసి, ZEPTO వ్యవస్థాపకులకు ట్యాగ్ చేశాడు. దీంతో సంస్థ దిగొచ్చి అతడికి రీఫండ్ ఇచ్చింది.

Similar News

News December 13, 2024

అల్లు అర్జున్‌కు ఏమైంది?

image

ఇటీవల పలు ఈవెంట్లలో చేసిన వ్యాఖ్యలతో అల్లు అర్జున్ వ్యవహారంపై కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. మొన్న ఈవెంట్‌లో <<14819498>>తెలంగాణ CM పేరును<<>> ఆయన మరిచిపోయారని చర్చ జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఢిల్లీ ఈవెంట్‌లోనూ సుకుమార్ పేరును <<14859353>>సుకుమార్ రెడ్డి<<>> అని సంబోధించారు. అయితే మరోసారి ఐకాన్ స్టార్ పొరబడ్డారని పలువురు పోస్టులు పెడుతున్నారు. దీంతో అల్లు అర్జున్‌కు ఏమైందని కామెంట్లు చేస్తున్నారు.

News December 13, 2024

అత్యధిక చెస్ టైటిళ్లు గెలిచిన దేశం ఏదంటే?

image

వరల్డ్ చెస్ ఛాంపియన్ షిప్‌ను అత్యధిక సార్లు గెలిచిన దేశంగా సోవియట్ యూనియన్(17) నిలిచింది. రెండో స్థానంలో రష్యా(6), ఇండియా (6), మూడో స్థానంలో నార్వే (5) ఉన్నాయి. USA, ఉక్రెయిన్, చైనా, ఉబ్జెకిస్థాన్, బల్గేరియా ఒక్కో టైటిల్ సాధించి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

☛ 1991లో సోవియట్ యూనియన్ 15 దేశాలుగా విడిపోయింది.

News December 13, 2024

పలువురికి పదవులు కేటాయించిన YCP

image

AP: మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను పొలిటికల్ అడ్వైజరీ కమిటీ(PAC) మెంబర్‌గా YCP నియమించింది. ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ CM జగన్ ఆదేశాల మేరకు నియామకం జరిగింది. అటు, వినుకొండ నియోజకవర్గానికి చెందిన పఠాన్ సలేహా ఖాన్‌ను పల్నాడు జిల్లా మైనార్టీ విభాగ అధ్యక్షుడిగా నియమించింది. అలాగే, మైలవరం నియోజకవర్గానికి చెందిన పామర్తి శ్రీనివాసరావును NTR జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ YCP ఉత్తర్వులు జారీ చేసింది.