News November 20, 2024
క్రోమ్ బ్రౌజర్‌ను గూగుల్ అమ్మక తప్పదా?

క్రోమ్ బ్రౌజర్‌ను గూగుల్ అమ్మేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇంటర్నెట్ సెర్చ్ మార్కెట్లో గూగుల్ గుత్తాధిపత్యంపై కోర్టు విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో మార్కెట్ బ్యాలెన్స్ అవ్వాలంటే క్రోమ్ బ్రౌజర్‌ను గూగుల్ విక్రయించేలా ఆదేశాలివ్వాలని కోర్టును అమెరికా న్యాయశాఖ(DoJ) కోరింది. అయితే.. క్రోమ్‌ను విక్రయిస్తే తమ వ్యాపారాలకు, వినియోగదారులకు నష్టం వాటిల్లుతుందని గూగుల్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.
Similar News
News November 27, 2025
SKLM: జిల్లాకు చేరుకున్న శాసనసభ అంచనాల కమిటీ అధికారులు

ఆంధ్రప్రదేశ్ శాసన సభ అంచనాల కమిటీ అధికారులు గురువారం శ్రీకాకుళం చేరుకున్నారు. ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణమూర్తి, శ్రీకాకుళం రెవిన్యూ డివిజనల్ అధికారి కే.సాయిప్రత్యూష, DSP వివేకానంద, DRDA PD కిరణ్ కుమార్ ఇతర అధికారులు అధికారులు ఘన స్వాగతం పలికారు. కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, శాసనమండలి సభ్యులు వివి సూర్యనారాయణరాజు, వరుదు కళ్యాణి అధికారులు ఉన్నారు.
News November 27, 2025
వైట్ ఎగ్స్‌కు రంగేసి నాటుకోడి గుడ్లంటూ..!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మురాదాబాద్‌లో నకిలీ నాటు కోడి గుడ్లను తయారుచేస్తోన్న ముఠాను ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టుకున్నారు. బ్రాయిలర్ ఎగ్స్(వైట్)కు రంగులు పూసి నాటు కోడి గుడ్లంటూ అమ్మకాలు జరుపుతున్నట్లు గుర్తించారు. ఇప్పటికే 4.5లక్షలకు పైగా గుడ్లను రంగు మార్చి అమ్మినట్లు గుర్తించగా.. గోదాంలో రెడీ అవుతోన్న మరో 45వేల ఎగ్స్‌ను సీజ్ చేశారు. ఇలాంటి నకిలీ గుడ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.
News November 27, 2025
బీసీలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి: KTR

TG: బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కేవలం 17 శాతమే ఇచ్చి కాంగ్రెస్ మోసం చేసిందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆరోపించారు. రిజర్వేషన్ల విషయంలో బీసీలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలన్నారు. CM రేవంత్ రాజకీయ నాయకుడిలా కాకుండా రియల్ ఎస్టేట్ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని.. హిల్ట్ పాలసీ పేరుతో 9,300 ఎకరాల పారిశ్రామిక భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు కుట్ర జరుగుతోందని విమర్శించారు.


