News November 20, 2024
క్రోమ్ బ్రౌజర్‌ను గూగుల్ అమ్మక తప్పదా?
క్రోమ్ బ్రౌజర్‌ను గూగుల్ అమ్మేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇంటర్నెట్ సెర్చ్ మార్కెట్‌లో గూగుల్ గుత్తాధిపత్యంపై కోర్టు విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో మార్కెట్ బ్యాలెన్స్ అవ్వాలంటే క్రోమ్ బ్రౌజర్‌ను గూగుల్ విక్రయించేలా ఆదేశాలివ్వాలని కోర్టును అమెరికా న్యాయశాఖ(DoJ) కోరింది. అయితే.. క్రోమ్‌ను విక్రయిస్తే తమ వ్యాపారాలకు, వినియోగదారులకు నష్టం వాటిల్లుతుందని గూగుల్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.
Similar News
News December 4, 2024
బాలయ్య కొత్త గెటప్ చూశారా?
పాత్ర ఏదైనా తన పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టడం బాలయ్యకు వెన్నతో పెట్టిన విద్య. అన్‌స్టాపబుల్ షోలో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బాలయ్య వ్యోమగామి లుక్‌లో కనిపించారు. దీంతో ఆదిత్య 369 సీక్వెల్‌కి బాలయ్య హింట్ ఇచ్చారంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు గతంలో బాలయ్యకు ఈ మూవీ సీక్వెల్‌ను తన కుమారుడు మోక్షజ్ఞతో తీస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో తాజా గెటప్ చర్చనీయాంశంగా మారింది.
News December 4, 2024
ఈ నెల 11న జిల్లాల్లో వైసీపీ నిరసనలు: జగన్
AP: ఈ నెల 11న రైతు సమస్యలపై వైసీపీ జిల్లా స్థాయిలో ర్యాలీలు నిర్వహిస్తుందని వైసీపీ చీఫ్ జగన్ తెలిపారు. ప్రజల తరఫున గళం విప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని మీడియా సమావేశంలో తెలిపారు. కరెంట్ ఛార్జీల బాదుడును నిరసిస్తూ ఈ నెల 27న ఆందోళన చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయమై జనవరి 3న కలెక్టర్ల వద్ద నిరసన చేపడుతామని చెప్పారు.
News December 4, 2024
ఇల్లు కట్టుకుంటే రూ.5,00,000.. GOOD NEWS
TG: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి డిసెంబర్ 6 నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం అవుతుందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సాయం 4 దశల్లో నేరుగా లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మిస్తామని పేర్కొన్నారు. మొదటి విడతలో నివాస స్థలం ఉన్నవారికి ఇళ్లు నిర్మించి ఇస్తామని, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులకు ప్రాధాన్యమిస్తామని చెప్పారు.