News April 15, 2025
మరో 15 రన్స్ చేసి ఉండాల్సింది: రిషభ్ పంత్

తాము ఇంకో 15 పరుగులు చేసి ఉండాల్సిందని LSG కెప్టెన్ రిషభ్ పంత్ అన్నారు. రన్‌రేట్ పెరుగుతున్న క్రమంలో ప్రతిసారీ వికెట్లు కోల్పోవడంతో అనుకున్న స్కోర్ చేయలేకపోయామని CSKతో ఓటమి తర్వాత తెలిపారు. మరోవైపు తాను బ్యాటింగ్‌లో నెమ్మదిగా లయ అందుకున్నట్లు చెప్పారు. పవర్ ప్లేలో బౌలింగ్ వేసే అంశంపై తాము దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. ప్రతి మ్యాచ్ నుంచి సానుకూల అంశాలు తీసుకొని ముందుకు సాగుతామని పంత్ వివరించారు.
Similar News
News April 18, 2025
ఉక్రెయిన్ ఆరోపణలు నిరాధారం: చైనా

రష్యాకు తాము ఆయుధాలు సరఫరా చేస్తున్నామని ఉక్రెయిన్ చేసిన ఆరోపణలు నిరాధారమని చైనా స్పష్టం చేసింది. ‘రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో మా వైఖరి చాలా క్లియర్‌గా ఉంది. సీజ్‌ఫైర్ రావాలనే మేం కోరుకుంటున్నాం. యుద్ధాన్ని త్వరగా ముగించి శాంతి చర్చలు ప్రారంభించాలని ఇరు దేశాలకూ చెబుతున్నాం. అలాంటిది రష్యాకు మేం ఎందుకు ఆయుధాలు సరఫరా చేస్తాం? అవి అర్థంలేని ఆరోపణలు’ అని పేర్కొంది.
News April 18, 2025
ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తా.. కేసులకు భయపడను: భూమన

AP: SV గోశాలలో ఆవుల మృతిపై మాట్లాడినందుకు తన మీద <<16135353>>కేసులు పెట్టడంపై<<>> టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. ఇలాంటి వంద కేసులు పెట్టినా తాను భయపడబోనని స్పష్టం చేశారు. ప్రభుత్వ తప్పులను ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నిస్తూనే ఉంటానని తేల్చిచెప్పారు. వ్యక్తిత్వ హననం చేస్తే తాను వెనక్కి తగ్గుతాననుకుంటే అది వారి భ్రమ అని పేర్కొన్నారు. ఈ 10 నెలల కాలంలో టీటీడీ అప్రదిష్టపాలైందని విమర్శించారు.
News April 18, 2025
నాకు గుడి కట్టండి: ఊర్వశి

స్పెషల్ సాంగ్స్‌తో ఫేమస్ అయిన ఊర్వశీ రౌతేలా దక్షిణాదిన తనకు గుడి కట్టాలని కోరారు. బద్రీనాథ్ దగ్గర్లో ఊర్వశీ ఆలయం ఉందని.. అక్కడ అందరూ తన ఆశీర్వాదం తీసుకుంటారని తెలిపారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులైతే తన ఫొటోకు మాలలు వేసి భక్తిగా కొలుస్తారన్నారు. పనిలో పనిగా దక్షిణాదినా ఒక గుడి కడితే బాగుంటుందని ఆకాంక్షించారు. ఈ వ్యాఖ్యలు చూశాక ఊర్వశిని త్వరగా డాక్టర్లకు చూపించాలని నెటిజన్స్ ఫైరవుతున్నారు.