News February 24, 2025
జగన్ మరోసారి అసెంబ్లీకి రాక తప్పదా?

AP: మాజీ సీఎం జగన్ మరోసారి అసెంబ్లీకి రాక తప్పదని తెలుస్తోంది. ఇవాళ అసెంబ్లీ సెషన్‌లో సభ్యులు చేసిన సంతకాలను పరిగణనలోకి తీసుకోరని సమాచారం. గవర్నర్ ప్రసంగం కస్టమరీ సెషన్ మాత్రమేనని, స్పీకర్ అధ్యక్షతన జరిగే సమావేశాన్నే వర్కింగ్ డేగా పరిగణిస్తారని అసెంబ్లీ అధికారులు చెబుతున్నారు. ఒకవేళ శాసనసభకు రాకపోతే సీటు వేకెంట్ అని ప్రకటించవచ్చని అంటున్నారు. దీంతో జగన్ మరోసారి అసెంబ్లీకి రాక తప్పదని సమాచారం.
Similar News
News March 21, 2025
వచ్చే ఏడాది పోలవరం పూర్తి: సీఆర్ పాటిల్

పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, మోదీ వచ్చాక ₹15K కోట్లు కేటాయించారని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. ఈ ఏడాదీ ₹12K కోట్లు ఇచ్చారని తెలిపారు. 2026 కల్లా ప్రాజెక్టును పూర్తిచేయాలని నిర్ణయించామన్నారు. దీంతో 2.91 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమవుతుందని, విశాఖతో పాటు 540 గ్రామాలకు తాగు నీరు లభిస్తుందని చెప్పారు. 28.5 లక్షల మంది ప్రజలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు.
News March 21, 2025
ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ వెబ్ సిరీస్

క్రైమ్ థ్రిల్లర్ ‘ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్’ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. హిందీ, ఇంగ్లిష్, బెంగాలీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌కు నీరజ్ పాండే దర్శకత్వం వహించగా జీత్, ప్రోసెన్‌జీత్ ఛటర్జీ, పరంబ్రత ఛటర్జీ, చిత్రాంగద కీలక పాత్రల్లో నటించారు. 2022లో వచ్చిన ‘ఖాకీ: ది బిహార్ ఛాప్టర్’ వెబ్ సిరీస్ సూపర్ హిట్టవడంతో నెట్‌ఫ్లిక్స్ పార్ట్-2 తెరకెక్కించింది.
News March 21, 2025
BIG ALERT: రేపు వడగళ్ల వాన!

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వడగళ్ల వానలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈమేరకు ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు కూడా పలు జిల్లాల్లో వడగళ్లు, గాలివాన బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే.