News February 18, 2025

అప్పులు చేయడానికి కేసీఆర్ రావాలా?: మంత్రి జూపల్లి

image

TG: కేసీఆర్‌పై మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శలకు దిగారు. ఆయన తిరిగి అధికారంలోకి రావాలని కోరుకునేది మళ్లీ అప్పులు చేయడానికేనా అని ప్రశ్నించారు. 10 ఏళ్ల తర్వాత కూడా నిరుద్యోగ సమస్య ఉందని దుయ్యబట్టారు. సర్పంచ్ బిల్లులు బకాయిలు పెట్టి ఇప్పుడు ఇవ్వట్లేదని అనడానికి కేటీఆర్‌కు సిగ్గుండాలని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో నాలుగు స్తంభాల ఆట నడిచిందని విమర్శించారు.

Similar News

News April 14, 2026

దేశంలో 16 మంది బీజేపీ సీఎంలు.. లిస్ట్ ఇదే

image

⋆ అస్సాం-హిమంత బిశ్వ శర్మ, అరుణాచల్‌ప్రదేశ్-పెమా ఖండూ
⋆ ఛత్తీస్‌గఢ్-విష్ణుదేవసాయ్, ఢిల్లీ-రేఖా గుప్తా
⋆ గోవా-ప్రమోద్ సావంత్, గుజరాత్-భూపేంద్ర పటేల్
⋆ హరియాణా-నాయబ్ సింగ్ సైనీ, UP-యోగి ఆదిత్యనాథ్
⋆ MP-మోహన్ యాదవ్, మహారాష్ట్ర-దేవేంద్ర ఫడణవీస్
⋆ మణిపుర్-యుమ్నాం ఖేమ్‌చంద్ సింగ్, ఉత్తరాఖండ్-పుష్కర్ సింగ్ ధామి
⋆ ఒడిశా-మోహన్ చరణ్ మాఝీ, త్రిపుర-మాణిక్ సాహా
⋆ రాజస్థాన్-భజన్‌లాల్ శర్మ, బిహార్-సామ్రాట్ చౌదరి

News April 14, 2026

చమురు భగభగతో భారత్‌ జీడీపీకి ఎఫెక్ట్: S&P

image

చమురు ధరల భగభగ నేపథ్యంలో మరో ఏజెన్సీ భారత్ GDP గ్రోత్‌పై తన అంచనాలు ప్రకటించింది. ఈ ఏడాది బ్యారెల్ ధర సగటున 130 డాలర్లుగా కొనసాగితే FY27లో గ్రోత్ 0.8% తగ్గొచ్చని S&P గ్లోబల్ రేటింగ్స్ వెల్లడించింది. FY27లో భారత్ జీడీపీ గ్రోత్ 7.1% ఉండొచ్చని గత నెల అంచనా వేసింది. ఇటీవల మోర్గాన్ స్టాన్లీ <<19592068>>సంస్థ<<>> కూడా మూడు నెలల పాటు చమురు ధర $150 వద్ద కొనసాగితే గ్రోత్ రేట్ 5.7%కే పరిమితమవుతుందని పేర్కొంది.

News April 14, 2026

రేపు ఇంటర్ ఫలితాలు: మంత్రి లోకేశ్

image

AP: రేపు (ఏప్రిల్ 15) ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదల చేయబోతున్నట్లు మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఉదయం 10.31 గంటలకు ఫస్టియర్, సెకండియర్ రిజల్ట్స్ వెల్లడిస్తామన్నారు. అందరికంటే ముందుగా Way2Newsలో వేగంగా, సులభంగా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
*Share It