News December 6, 2024
S.K అధ్యక్షుడు యూన్‌కు అభిశంసన తప్పదా?

నియంతృత్వ పోకడలు ప్రదర్శించిన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌పై అభిశంసన తప్పేలా లేదు. దేశంలో సైనిక పాలన విధించిన యూన్ ప్రజాగ్రహానికి తలొగ్గిన విషయం తెలిసిందే. అయినా ఆయన్ను తప్పించేందుకు అధికార, విపక్షాలు అత్యవసరంగా సమావేశమయ్యాయి. యూన్‌పై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానంపై శనివారం ఓటింగ్ జరగనుంది. 2027 వరకు పదవీకాలం ఉన్నా అభిశంసన నెగ్గితే యూన్ తప్పుకోవాల్సిందే.
Similar News
News November 15, 2025
యాంటీబయాటిక్స్‌తో ఎర్లీ ప్యూబర్టీ

పుట్టిన తొలినాళ్లలో యాంటీబయోటిక్స్ వాడిన ఆడపిల్లల్లో ఎర్లీ ప్యూబర్టీ వస్తున్నట్లు తాజా అధ్యయంలో వెల్లడైంది. దక్షిణ కొరియాకి చెందిన యూనివర్సిటీ ఆసుపత్రులు చేసిన అధ్యయనంలో ఏదైనా అనారోగ్య కారణంతో ఏడాదిలోపు- ముఖ్యంగా తొలి మూడునెలల్లో- యాంటీబయోటిక్స్ తీసుకున్న ఆడపిల్లల్లో 22 శాతం మంది ఎనిమిదేళ్లకంటే ముందుగానే రజస్వల అవడాన్ని గమనించారు. ఈ పరిస్థితిని సెంట్రల్ ప్రికాషియస్ ప్యుబర్టీ అంటారు.
News November 15, 2025
విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్

TG: ప్రభుత్వ స్కూళ్లలో చదివే టెన్త్ విద్యార్థులకు ఈసారి అన్ని సబ్జెక్టుల స్టడీ మెటీరియల్ పంపిణీ చేయాలని సర్కార్ నిర్ణయించింది. గతంలో జీవ, భౌతిక, సాంఘికశాస్త్రం, గణితం సబ్జెక్టు మెటీరియల్సే అందజేసేది. ఈసారి వాటితో పాటు తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ సబ్జెక్టులకూ ఇవ్వాలని డిసైడ్ అయింది. ఈనెలలో పంపిణీ చేసేందుకు 2 లక్షల మంది విద్యార్థుల కోసం రూ.7.52 లక్షల స్టడీ మెటీరియల్స్ సిద్ధం చేయిస్తోంది.
News November 15, 2025
NFCలో 405 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

HYDలోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్(NFC)405 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్, ITI అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 – 25ఏళ్ల మధ్య ఉండాలి. టెన్త్ మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎలక్ట్రీషియన్ పోస్టులకు మాత్రం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.


