News December 6, 2024
S.K అధ్యక్షుడు యూన్‌కు అభిశంసన తప్పదా?
నియంతృత్వ పోకడలు ప్రదర్శించిన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌పై అభిశంసన తప్పేలా లేదు. దేశంలో సైనిక పాలన విధించిన యూన్ ప్రజాగ్రహానికి తలొగ్గిన విషయం తెలిసిందే. అయినా ఆయన్ను తప్పించేందుకు అధికార, విపక్షాలు అత్యవసరంగా సమావేశమయ్యాయి. యూన్‌పై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానంపై శనివారం ఓటింగ్ జరగనుంది. 2027 వరకు పదవీకాలం ఉన్నా అభిశంసన నెగ్గితే యూన్ తప్పుకోవాల్సిందే.
Similar News
News January 14, 2025
చిన్నారులతో కలిసి ‘గేమ్ ఛేంజర్’ చూసిన ఢిల్లీ బీజేపీ చీఫ్
రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర చిన్నారులతో కలిసి వీక్షించారు. మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీని తన పుట్టిన రోజు సందర్భంగా గాడ్స్ స్పెషల్ ఏంజెల్స్ చిన్నారులతో చూశారు. ఈ విషయాన్ని ఆయన Xలో తెలియజేశారు. ఈ నెల 10న విడుదలైన ఈ మూవీ ఇప్పటివరకు రూ.300 కోట్ల వసూళ్లు రాబట్టింది.
News January 14, 2025
ఈరోజు నమాజ్ వేళలు
✒ తేది: జనవరి 14, మంగళవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.25 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.01 గంటలకు
✒ ఇష: రాత్రి 7.17 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News January 14, 2025
ఇది పక్కా పండగ సినిమా: అనిల్ రావిపూడి
‘సంక్రాంతికి వస్తున్నాం’ విడుదల కానున్న నేపథ్యంలో దర్శకుడు అనిల్ రావిపూడి ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ సినిమాను థియేటర్లకు చేరువ చేసేందుకు రచన, దర్శకత్వం, ప్రమోటింగ్ అంశాల్లో ప్రతి ప్రయాణాన్ని తాను ఆస్వాదించినట్లు తెలిపారు. ‘మా పక్క పండగ సినిమాతో ఈ సంక్రాంతిని రెట్టింపు ఎనర్జీతో అందరూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం’ అని రాసుకొచ్చారు.