News April 25, 2024

ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీకి బెయిల్ ఇవ్వరా?: కేసీఆర్

image

TG: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇవ్వరా అని కేసీఆర్ ప్రశ్నించారు. వారు ఎక్కడికైనా పారిపోతారా అని అన్నారు. స్కామ్ విచారణ అంటూ అనవసరంగా అమాయకులను మోదీ శిక్షిస్తున్నారని దుయ్యబట్టారు. ఆప్ చీఫ్ కేజ్రీవాల్‌పై గెలిచే శక్తి లేకనే అరెస్ట్ చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టి, 700 మంది ప్రజాప్రతినిధులను బీజేపీలోకి లాక్కున్నారని మండిపడ్డారు.

Similar News

News December 4, 2025

దేశ సేవలో అన్నదమ్ములు..

image

నంద్యాల జిల్లా రుద్రవరం గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు అగ్నివీరులుగా ఎంపికయ్యారు. మహబూబ్ బాషా కుమారులు అబ్దుల్ నబీ, మహమ్మద్ ఇర్ఫాన్ అగ్నివీర్ నియామకాల్లో ప్రతిభ చూపారు. బెంగళూరులో శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం మహమ్మద్ ఇర్ఫాన్ రాజస్థాన్‌లో, అబ్దుల్ నబీ హిమాచల్‌ప్రదేశ్‌లో విధుల్లో చేరి బాధ్యతలు స్వీకరించారు. దేశ సేవకు అంకితమైన వారిని స్థానికులు అభినందించారు.

News December 4, 2025

థైరాయిడ్‌ ట్యూమర్స్‌ గురించి తెలుసా?

image

థైరాయిడ్‌ గ్రంథి పనితీరుపైనే మనిషి జీవక్రియలు ఆధారపడి ఉంటాయి. ఇంతటి ప్రధానమైన థైరాయిడ్‌ గ్రంథిలో కొన్నిసార్లు ట్యూమర్స్ ఏర్పడతాయి. గొంతు భాగంలో వాపు/ గడ్డ ఏర్పడినట్లు కనిపిస్తుంది. ఈ వాపు అనేది ఆహారం తీసుకునేటప్పుడు లేదా మింగేటప్పుడు పైకీ కిందకీ కదులుతుంది. కానీ ఎటువంటి నొప్పి, ఇబ్బంది ఉండదని నిపుణులు చెబుతున్నారు. కణితి పరిమాణం పెరిగినప్పుడు ఆహారం తీసుకుంటుంటే పట్టేసినట్లుగా అనిపిస్తుంది.

News December 4, 2025

థైరాయిడ్‌ ట్యూమర్స్‌ చికిత్స

image

థైరాయిడ్‌ ట్యూమర్స్‌ వచ్చినప్పుడు అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చేసి ఏ రకమైన కణితో తెలుసుకుంటారు. అలా తెలియకపోతే నీడిల్‌ ద్వారా కణితిలోని కొన్ని కణాలను బయటికి తీసి, మైక్రోస్కోప్‌లో పరీక్షిస్తారు. థైరాయిడ్‌ కణితి 3 సెం.మీ. కన్నా పెద్దగా ఉండి, ఆహారం తీసుకున్నప్పుడు ఇబ్బందికరంగా ఉంటే సాధారణంగా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. అవసరాన్ని బట్టి నాన్‌ సర్జికల్‌ ట్రీట్‌మెంట్‌/ సర్జికల్ ట్రీట్‌మెంట్ చేస్తారు.