News April 25, 2024
ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీకి బెయిల్ ఇవ్వరా?: కేసీఆర్

TG: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇవ్వరా అని కేసీఆర్ ప్రశ్నించారు. వారు ఎక్కడికైనా పారిపోతారా అని అన్నారు. స్కామ్ విచారణ అంటూ అనవసరంగా అమాయకులను మోదీ శిక్షిస్తున్నారని దుయ్యబట్టారు. ఆప్ చీఫ్ కేజ్రీవాల్‌పై గెలిచే శక్తి లేకనే అరెస్ట్ చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టి, 700 మంది ప్రజాప్రతినిధులను బీజేపీలోకి లాక్కున్నారని మండిపడ్డారు.
Similar News
News March 17, 2026
రేపటి నుంచే దివ్యాంగులకు ఉచిత ప్రయాణం!

AP: RTC బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం రేపటి నుంచి అందుబాటులోకి రానుంది. ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. 40 శాతం, ఆపైన వైకల్యం ఉన్న దివ్యాంగులు సిటీ ఆర్డినరీ, మెట్రో, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఫ్రీగా వెళ్లొచ్చు. బస్సు ఎక్కేటప్పుడు PHC పాస్/వికలాంగుల కార్డు చూపించి జీరో టికెట్ తీసుకోవాలని RTC సూచించింది.
News March 17, 2026
KKRకు గాయాల ‘దెబ్బ’

IPL ప్రారంభానికి ముందు KKRను గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే ఇంజూరీతో హర్షిత్ రాణా <<19394540>>నడవలేని <<>>స్థితిలో ఉన్నారు. T20 WC సందర్భంగా గాయపడ్డ శ్రీలంక పేసర్ పతిరణ ఆడటం కూడా అనుమానంగా మారింది. KKR అతడిని రూ.18Crకు కొనుగోలు చేసింది. అయితే ఏదో ఒక దశలో పతిరణ అందుబాటులోకి వస్తాడని భావిస్తోంది. పతిరణ, రాణాకు రీప్లేస్‌మెంట్ తీసుకోవద్దని నిర్ణయించింది. ముస్తాఫిజుర్ ప్లేస్‌లో <<19375126>>ముజరబానిని<<>> తీసుకుంది.
News March 17, 2026
ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీలో రాయితీ

మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ఆస్తి పన్ను బకాయిలపై AP ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెలాఖరులోగా చెల్లిస్తే వడ్డీలో 50 శాతం రాయితీ కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. అటు తెలంగాణలోని హైదరాబాద్ పరిధిలో ఆస్తి పన్ను బకాయిలపై 90 శాతం వడ్డీ మినహాయింపు ఇవ్వనున్నట్లు GHMC ఇటీవల ప్రకటించింది. మార్చి 31 వరకు అవకాశం ఉంటుందని తెలిపింది.


