News December 21, 2024
ఫామ్‌హౌస్‌లో ఉన్న వారికి రైతు భరోసా ఇవ్వాలా?: సీతక్క

TG: కౌలు రైతులకు బీఆర్ఎస్ పార్టీ గతంలో రైతు బంధు ఎందుకు ఇవ్వలేదని మంత్రి సీతక్క అసెంబ్లీలో మండిపడ్డారు. ‘రూ.5లక్షల జీతాలు తీసుకునే వారికి గతంలో రైతు బంధు వచ్చింది. సాగులో లేని, గుట్టలకు కూడా డబ్బులు వేశారు. నిజంగా సాగు చేస్తూ పట్టాలు లేని రైతులకు ఇవ్వలేదు. పట్టా ఉన్నవారికే మీ పాలనలో రైతుబంధు ఇచ్చారు. ఫామ్‌హౌస్‌లో ఉన్న వారికి కూడా డబ్బులు ఇవ్వాలా?’ అని ఆమె ప్రశ్నించారు.
Similar News
News November 20, 2025
HYDలో పక్షులు చూద్దామన్నా.. కనిపించట్లేదు!

HYD నుంచి ORR పరిసరాల్లో గతంలో అనేక రకాల పక్షులు కనపడేవి. అయితే ఇటీవల వలస పక్షుల సంచారం గణనీయంగా తగ్గిపోయింది. మారుతున్న వాతావరణం, వేగంగా పెరుగుతున్న పట్టణీరీకరణ, జలవనరుల తగ్గుదల, చెరువులు, కుంటలు తగ్గటం వంటి కారణాలు పక్షుల నివాసాలను ప్రభావితం చేస్తున్నాయి. పర్యావరణాన్ని కాపాడకపోతే జీవ వైవిధ్యం మరింత ప్రమాదంలో పడుతుందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
News November 20, 2025
సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్.. ఇవాళే లాస్ట్ డేట్

ప్రతిభావంతులైన ఆడపిల్లల్ని ప్రోత్సహించేందుకు CBSE ప్రత్యేక స్కాలర్‌షిప్‌ని అందిస్తోంది. నేటితో దరఖాస్తు గడువు ముగుస్తోంది. పదోతరగతిలో 70%మార్కులు వచ్చి ప్రస్తుతం CBSE అనుబంధ పాఠశాలల్లో 11th చదువుతున్న విద్యార్థినులు ఈ స్కాలర్షిప్కు అప్లై చేసుకోవచ్చు. గతేడాది ఎంపికైన విద్యార్థినులూ రెన్యువల్ చేసుకోవచ్చు. ప్రతి నెలా ₹1000 చొప్పున రెండేళ్ల పాటు అందజేస్తారు. వెబ్సైట్ <
News November 20, 2025
ఇస్రోలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

<


