News September 7, 2024

హత్యాచార నిందితుడికి బెయిల్ ఇచ్చేయాలా?.. సీబీఐపై జడ్జి ఆగ్రహం

image

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార కేసు విచారణకు సీబీఐ తరఫు లాయర్ 40 నిమిషాలు ఆలస్యంగా హైకోర్టుకు వచ్చారు. దీంతో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇది సీబీఐ అలసత్వానికి నిదర్శనం. చాలా దురదృష్టకరం. నిందితుడు సంజయ్ రాయ్‌కు బెయిల్ మంజూరు చేయమంటారా?’ అని మండిపడ్డారు. చివరికి వాదనలు విన్న జడ్జి నిందితుడిని 14 రోజుల జుడీషియల్ కస్టడీకి పంపారు

Similar News

News October 15, 2024

ఇస్రో చీఫ్‌కు వరల్డ్ స్పేస్ అవార్డు

image

ఇస్రో చీఫ్ సోమనాథ్ ఐఏఎఫ్ వరల్డ్ స్పేస్ అవార్డు-2024ను అందుకున్నారు. మిలాన్‌లో జరిగిన ఈవెంట్‌లో ఆయనకు ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ ఈ అవార్డును ప్రదానం చేసింది. గత ఏడాది ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతమైన నేపథ్యంలో దానికి గుర్తుగా ఆయనను ఈ అవార్డుతో సత్కరించింది. ఈ మిషన్ అంతర్జాతీయ స్థాయిలో సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించిందని, చరిత్రాత్మక మైలురాయిగా నిలిచిందని పేర్కొంది.

News October 15, 2024

భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

image

AP: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ముందుజాగ్రత్తగా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు ఇవాళ కలెక్టర్లు సెలవు ప్రకటించారు.

News October 15, 2024

అనిల్ అంబానీని లాభాల్లోకి తెచ్చిన వారసులు

image

నష్టాలు, అప్పుల్లో కూరుకుపోయిన అనిల్ అంబానీని ఆయన కుమారులు అన్‌మోల్, అన్షుల్ లాభాల్లోకి తీసుకువచ్చి సగర్వంగా తలెత్తుకునేలా చేశారు. వారి రాకతో రిలయన్స్ పవర్ రూ.20,526 కోట్ల విలువైన కంపెనీగా నిలబడింది. రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్, రిలయన్స్ క్యాపిటల్ సంస్థలూ లాభాల బాట పట్టడంతో కొడుకులను చూసి అనిల్ మురిసిపోతున్నారు. ఇదే ఉత్సాహంతో అనిల్ భూటాన్‌లో సోలార్, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులను చేపడుతున్నారు.