News November 26, 2024
అసెంబ్లీ గడువు ముగిస్తే రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందేనా..
అలాంటి నిబంధనేమీ లేదు. రాజకీయ అనిశ్చితిని బట్టి గవర్నర్ కేంద్రానికి నివేదిక పంపిస్తారు. స్థిరత్వం ఉంటే ఆపద్ధర్మ CMను నియమిస్తారు. లేదంటే రాష్ట్రపతి పాలనకు మొగ్గు చూపుతారు. <<14711279>>మహారాష్ట్ర<<>>లో 4 సందర్భాల్లో అసెంబ్లీ గడువు ముగిశాకా కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమిచ్చారు. 2004, 2009, 2014, 2019లో అసెంబ్లీ గడువులు ముగిసినా 7-30 రోజులు వ్యవధి తర్వాత కొత్త సీఎంలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈసారీ అలాగే జరగొచ్చు.
Similar News
News December 11, 2024
మా నాన్న దేవుడు: మనోజ్
TG: కుటుంబం కోసం ఎంతో కష్టపడి పనిచేశానని మంచు మనోజ్ తెలిపారు. ‘మా నాన్న నాకు దేవుడు. ఇవాళ మీరు చూస్తున్న వ్యక్తి కాదు ఆయన. వేరేవాళ్లు ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారు. మా అన్న విష్ణు, వినయ్.. నాన్నపై గన్ను పెట్టి కాలుస్తున్నారు. నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్పా? అది నచ్చక కుట్ర చేస్తున్నారు. నేను, నా భార్య ఎవరి పనివారు చేసుకుంటున్నాం.’ అని మనోజ్ ఎమోషనల్ అయ్యారు.
News December 11, 2024
జర్నలిస్టుల ధర్నాకు మంచు మనోజ్ మద్దతు
సినీ నటుడు మోహన్ బాబుకు వ్యతిరేకంగా జర్నలిస్టులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ కూడా పాల్గొని వారికి మద్దతు పలికారు. ‘మా నాన్న తరఫున నేను మీడియాకు క్షమాపణలు చెబుతున్నా. మీడియాపై దాడి దారుణం. ఇలాంటి రోజు వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. నేను ఆయనను ఎలాంటి ఆస్తులు అడగలేదు’ అని ఆయన పేర్కొన్నారు.
News December 11, 2024
విశ్వక్, అనుదీప్ కొత్త మూవీ ‘ఫంకీ’
విశ్వక్ సేన్, అనుదీప్ కాంబినేషన్‌లో ‘ఫంకీ’ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇవాళ జరిగాయి. సంక్రాంతి తర్వాత రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. నాగవంశీ-సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తారు. కాగా విశ్వక్ సేన్ నటించిన ‘మెకానిక్ రాకీ’ మూవీ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నట్లు తెలుస్తోంది.