News March 22, 2024

MPగా పోటీ చేసే రాష్ట్రంలో ఓటు ఉండాలా?

image

రాజ్యసభ సభ్యత్వానికి కనీస వయస్సు 30సం.లు, లోక్‌సభకు పోటీ చేసేందుకు కనీస వయస్సు 25సం.లు ఉండాలి. భారత పౌరసత్వంతో పాటు, దేశంలో ఏదైనా <<12903689>>ఒక నియోజకవర్గంలో<<>> ఓటరై ఉండాలి. 2సం.ల కంటే ఎక్కువ జైలు శిక్షకు గురికావద్దు. గుర్తింపు పొందిన పార్టీ నుంచి పోటీకి ఆ నియోజకవర్గంలో ఒక ప్రపోజర్ సంతకం కావాలి. స్వతంత్ర అభ్యర్థికి పది మంది ప్రపోజర్లు ఉండాలి. రూ.25 వేల సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. మానసికంగా పరిపక్వత తప్పనిసరి.

Similar News

News September 14, 2024

విషాదం: టీ పౌడర్ అనుకొని..

image

AP: తూ.గో జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. టీ పౌడర్ అనుకుని పొరపాటున వృద్ధదంపతులు పురుగుమందు కలిపిన టీ తాగి చనిపోయారు. రాజానగరం(M) పల్లకడియంకు చెందిన గోవింద్(75), అప్పాయమ్మ(70) ఇంటిముందు ఓ కోతి పురుగుమందు ప్యాకెట్ తీసుకొచ్చి పడేసింది. కంటిచూపు మందగించిన అప్పాయమ్మ దాన్ని టీపౌడర్ అనుకొని టీ పెట్టి భర్తకిచ్చి, తానూ తాగింది. కాసేపటికే నురగలు కక్కుతూ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

News September 14, 2024

కాంగ్రెస్ హామీలపై మోదీ హాట్ కామెంట్స్

image

హామీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని ప్రధాని మోదీ విమర్శలకు దిగారు. కర్ణాటక, తెలంగాణలో రైతులకు మద్దతు ధర ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. దమ్ముంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్‌కు ఓటు వేసినందుకు కర్ణాటక, టీజీ ప్రజలు బాధపడుతున్నారని పేర్కొన్నారు. ధనిక రాష్ట్రాలను కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు.

News September 14, 2024

‘మత్తు వదలరా-2’ వచ్చేది ఈ ఓటీటీలోనే

image

నిన్న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ‘మత్తు వదలరా-2’ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత కొన్ని వారాలకు ఈ మూవీ ఓటీటీలో రానుంది. ఇందులో శ్రీసింహ, కమెడియన్ సత్య, హీరోయిన్ ఫరియా ప్రధాన పాత్రల్లో నటించగా, రితేశ్ రానా దర్శకత్వం వహించారు. తొలిరోజు ఈ మూవీ రూ.5.3కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది.