News February 13, 2025
ఉచిత పథకాలు ఉండాలా? వద్దా? మీ కామెంట్!

ప్రాంతీయ, జాతీయ పార్టీలనే తేడా లేకుండా ప్రతి పార్టీ ఉచితాలకు మొగ్గు చూపుతోంది. ఎన్నికల హామీల్లో ఉచిత పథకాలను పొందుపరుస్తున్నాయి. ఇవి లేకుంటే ఓటర్లు ఓటెయ్యరేమోననే భయం. ఫ్రీ స్కీంలకు దూరంగా ఉండే బీజేపీ సైతం ఇటీవల ఢిల్లీ ఎన్నికల్లో హామీలు గుప్పించింది. వీటితో ప్రజలు పని చేసేందుకు ఇష్టపడట్లేదని తాజాగా సుప్రీంకోర్టు సైతం వ్యాఖ్యానించింది. మరి ఈ హామీలను మన పార్టీలు ఆపగలవా? ప్రజలు మారుతారా?
Similar News
News March 22, 2025
IPL: ఆ రికార్డు బ్రేక్ చేసేదెవరో?

నేటి నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీలో కొన్ని రికార్డులు ఇంకా పదిలంగానే ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు(175), అత్యధిక సిక్సర్లు(357) విధ్వంసకర బ్యాటర్ గేల్ పేరిట ఉన్నాయి. సిక్సర్ల రికార్డుకు ఇతర ఆటగాళ్లు చాలా దూరంలో ఉన్నా అత్యధిక స్కోరు రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. మరి ఇప్పుడున్న ప్లేయర్లలో ఏ ఆటగాడు ఆ రికార్డు బ్రేక్ చేస్తారని భావిస్తున్నారు? COMMENT.
News March 22, 2025
బ్యాంకుల సమ్మె వాయిదా

ఈనెల 24, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన బ్యాంక్ ఉద్యోగుల సమ్మెను వాయిదా వేస్తున్నట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(UFBU) ప్రకటించింది. వారంలో ఐదు రోజుల పని, అన్ని క్యాడర్లలో తగినన్ని నియామకాలు చేపట్టడం వంటి డిమాండ్ల విషయంలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(IBA), కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడంతో వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.
News March 22, 2025
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. నిధుల విడుదల

AP: ఫీజు రియంబర్స్‌మెంట్ పథకానికి రూ.600 కోట్ల నిధులు విడుదల చేసినట్లు విద్యాశాఖ కార్యదర్శి ప్రకటించారు. త్వరలో మరో రూ.400కోట్లు రిలీజ్ చేస్తామని తెలిపారు. దీంతో ఇప్పటివరకూ ఈ పథకానికి మెుత్తంగా రూ.788కోట్లు విడుదలయినట్లు పేర్కొన్నారు. పెండింగ్ బకాయిలు సైతం త్వరలోనే చెల్లిస్తామని అయితే ఫీజుల పేరుతో విద్యార్థులను ఇబ్బందులు పెడితే మాత్రం కాలేజీ యాజమాన్యాలపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.