News December 21, 2024
రాళ్లకు, గుట్టలకూ రైతుభరోసా ఇద్దామా?: రేవంత్
TG: సాగులో లేని భూములకు గత ప్రభుత్వం రైతుబంధు ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. ‘రూ.22వేల కోట్లకు పైగా నిధులు దుర్వినియోగం అయ్యాయి. రియల్ ఎస్టేట్, పారిశ్రామికవేత్తలకూ రైతుబంధు అందింది. రోడ్లు వేసిన భూములకూ డబ్బులు పడ్డాయి. రాళ్లకు, గుట్టలకూ రైతుబంధు ఇద్దామా?’ అని అసెంబ్లీలో MLAలను అడిగారు. రైతుభరోసాపై ఎలాంటి అనుమానం అక్కర్లేదు. అందరికీ ఇస్తాం’ అని వెల్లడించారు.
Similar News
News January 22, 2025
వింటర్లో వీటిని తినడం లేదా..?
చలికాలంలో కొన్ని ఆహార పదార్థాలు కచ్చితంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో నారింజ, నిమ్మకాయ రసం తాగాలి. అలాగే చిలగడ దుంపలు, సలాడ్లు, చియా సీడ్స్, బాదం, జీడిపప్పు తీసుకోవాలి. ఆకుకూరలు, క్యారెట్, అల్లం, వెల్లుల్లి ఎక్కువగా తినాలి. కొన్ని కూరగాయలు, పప్పులు, మాంసంతో చేసిన సూప్ తీసుకుంటే శరీరం వెచ్చబడుతుంది. పాలకూర, బచ్చలికూర తీసుకుంటే శరీరానికి విటమిన్లు, ఖనిజాలు అందుతాయి.
News January 22, 2025
పౌరసత్వంపై ట్రంప్ నిర్ణయం: కోర్టులో పిటిషన్
జన్మతః పౌరసత్వంపై ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై అమెరికాలోని న్యూ హ్యాంప్‌షైర్ డిస్ట్రిక్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇమ్మిగ్రెంట్స్ రైట్స్ అడ్వకేట్స్ అనే సంస్థ ఈ పిటిషన్ వేసింది. ట్రంప్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని, ఇది అమెరికా ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నమని పిటిషనర్లు పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 14న సవరణ ప్రకారం అమెరికాలో పుట్టిన ప్రతి బిడ్డకు జన్మతః పౌరసత్వం లభిస్తుందని తెలిపారు.
News January 21, 2025
జన్మత: పౌరసత్వం రద్దు.. నెక్స్ట్ ఏంటి?
డొనాల్డ్ ట్రంప్ ఆటోమెటిక్ సిటిజన్‌షిప్ రద్దు చేయడంతో పిల్లలు 21 ఏళ్లు వచ్చేసరికి అమెరికా నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే స్టూడెంట్ వీసా తీసుకొని ఆ దేశంలో ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. అయితే వారిని ఇంటర్నేషనల్ స్టూడెంట్లుగా పరిగణిస్తారు. ఫలితంగా ఉపకారవేతనాలు లాంటి యూనివర్సిటీ బెనెఫిట్స్ ఏమీ అందవు. మరోవైపు ఈ నిర్ణయంతో అమెరికాకు వెళ్లే భారతీయుల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.