News January 25, 2025
ఇలాంటి వారు అరటిపండు తినకూడదా?

అరటి పండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ కొందరు వీటిని తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలర్జీ, శ్వాసకోస సమస్యలు, ఆస్తమా బాధితులు తినకూడదు. మలబద్ధకం ఉన్న వారు తింటే అది మరింత తీవ్రం కావచ్చు. కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఎక్కువగా తినకూడదు. బీపీ, షుగర్ ఉన్నవారు, అధిక బరువుతో సతమతమయ్యేవారు తినకుంటేనే మంచిది. అరటిలో చక్కెర శాతం ఎక్కువ కాబట్టి వీరికి అంతగా మేలు చేయదు.
Similar News
News February 10, 2025
26 ఏళ్ల క్రితం.. ఢిల్లీకి 5 ఏళ్లలో ముగ్గురు సీఎంలు!

ఢిల్లీలో 26 ఏళ్ల తర్వాత బీజేపీ సర్కార్ ఏర్పాటు కాబోతోంది. అయితే చివరిసారిగా (1993-1998) ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్లలో ముగ్గురు సీఎంలు పాలించారు. తొలుత మదన్‌లాల్ ఖురానా సీఎం అయ్యారు. అవినీతి ఆరోపణలు రావడంతో 27 నెలలకే రాజీనామా చేశారు. ఆ తర్వాత సాహిబ్ సింగ్ వర్మ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఉల్లి ధరలపై విమర్శలతో 31 నెలల్లో రిజైన్ చేశారు. ఆ తర్వాత సుష్మా స్వరాజ్ 52 రోజులపాటు సీఎంగా ఉన్నారు.
News February 10, 2025
హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం

TG: సెలవు దినాల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను చేపట్టొద్దని హైడ్రాకు హైకోర్టు సూచించింది. శుక్రవారం నోటీసులిచ్చి, వివరణ ఇచ్చేందుకు శనివారం ఒక్కరోజే సమయమిస్తూ ఆదివారం కూల్చివేస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగారెడ్డి(D) అబ్దుల్లాపూర్‌మెట్(M) కోహెడలో నిర్మాణాల కూల్చివేతలపై నమోదైన పిటిషన్‌ను విచారించింది. వివరణ ఇచ్చేందుకు భవన యజమానులకు సహేతుకమైన సమయం ఇవ్వాలని పేర్కొంది.
News February 10, 2025
షమీ భాయ్.. ఇలా అయితే ఎలా?

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు IND బౌలర్ షమీ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలే జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన ఈ పేసర్ స్థాయికి తగ్గట్లుగా రాణించడం లేదు. ENGతో తొలి ODIలో 8 ఓవర్లు వేసి 38/1తో ఫర్వాలేదనిపించినా, రెండో వన్డేలో 7.5 ఓవర్లకే 66 రన్స్ సమర్పించుకున్నారు. అనుకున్న లైన్, లెంగ్త్‌లో బౌలింగ్ చేయలేకపోతున్నారు. CTకి బుమ్రా దూరమయ్యే ఛాన్సున్న నేపథ్యంలో షమీ ఫామ్‌లోకి రావడం ముఖ్యమని విశ్లేషకులు అంటున్నారు.